వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్లో జీతాలు: సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై అధికారులు సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జీతాల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ. వెయ్యి కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులను గ్రీన్ ఛానళ్లో పెట్టి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని సూచించారు. వీటిపై త్వరగా నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ap cm jagan reviewd on contract employes

ప్రభుత్వ శాఖలతోపాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

వివిధ ప్రభుత్వ శాఖలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదని ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్‌పై హడావుడిగా టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలు చేసే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం తీసుకుందని అధికారులు పేర్కొన్నారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జులై నుంచి మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

English summary
ap cm jagan reviewd on contract employes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X