వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స‌భ‌లో జ‌గ‌న్ సెల్ఫ్‌గోల్‌: చ‌ంద్ర‌బాబు చెప్పిందే నిజ‌మ‌ని తేల్చిన సీఎం: ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో వైసీపీ..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌భా సాక్షిగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. సున్నా వ‌డ్డీ ప‌ధ‌కం కింద చంద్ర‌బాబు రూపాయి కూడా చెల్లించ‌లేద‌ని నిరూపిస్తాన‌ని..చంద్ర‌బాబు రాజీనామా చేస్తారా అని జ‌గ‌న్ స‌వాల్ చేసారు. దీని మీద వైసీపీ నేత‌లు సైతం టీడీపీని నిల‌దీసారు. అయితే, రెండో రోజూ స‌భ‌లో టీడీపీ ఇదే అంశాన్ని ప్ర‌స్తావించింది. జీరో వ‌డ్డీ కింద చెల్లించిన లెక్క‌ల‌ను స‌భ ముందుంచారు. ఆ త‌రువాత జ‌గ‌న్ సైతం త‌న లెక్క‌ల్లో చంద్ర‌బాబు సున్నా వ‌డ్డీ కింద చేసిన చెల్లింపుల‌ను చెప్ప‌టం ద్వారా..తాను చేసిన వాద‌న త‌ప్ప‌ని ప‌రోక్షంగా ఒప్పుకున్న‌ట్లే క‌నిపించింది. అయితే, ఇవ్వాల్సింది ఇవ్వ‌కుండా విదిలింపులు చేస్తే చెల్లించిన‌ట్లా అంటూ ప్ర‌భుత్వం స‌మ‌ర్ధించుకొనే ప్ర‌య‌త్నం చేసింది. చంద్ర‌బాబు టీం మాత్రం ముఖ్య‌మంత్రి ఇరుకున ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు.

రెండో రోజు స‌భ‌లోనూ అదే చ‌ర్చ‌..

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో రెండో రోజు సున్నా వ‌డ్డీ పైనే చ‌ర్చ సాగింది. తొలుత స్పీక‌ర్ ఆ చ‌ర్చ ముగిసింద‌ని.. ఇక దాని పైన చ‌ర్చ ఉండ‌ద‌ని చెప్పారు. కానీ, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జోక్యం చేసుకొని సున్నా వ‌డ్డీ అంశం మీద చ‌ర్చ చేప‌ట్టాల‌ని సూచించారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు..ఉప నేత రామానాయుడు త‌మ వ‌ద్ద వ్య‌వ‌సాయ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ముర ళీ ధ‌ర్ రెడ్డి ఇచ్చిన అధికారిక స‌మాచారం అంటూ టీడీపీ హ‌యాంలో ఇచ్చిన సున్నా వ‌డ్డీ లెక్క‌ల‌ను వివ‌రించారు.
చంద్ర‌బాబు మాట్లాడుతూ స‌భ‌లో గురువారం ముఖ్య‌మంత్రి ఎందుకు ఆవేశ‌ప‌డ్డారో తెలియ‌టం లేద‌ని..ఇప్పుడు మా హ‌యాంలో ఇచ్చిన సున్నావ‌డ్డీ లెక్క‌ల‌ను స‌భ ముందుచాము. మ‌రి..ముఖ్య‌మంత్రి రాజీనామా చేస్తారా లేక ఏపీ ప్ర‌జ‌ల కు క్ష‌మాప‌ణ చెబుతారా అని ప్ర‌శ్నించారు. టీడీపీ హ‌యాంలో మొత్తంగా 415 కోట్లు చెల్లించామ‌ని వివ‌రించారు. దీని పైన ముఖ్య‌మంత్రి స్పందించాల‌ని కోరారు.

చంద్ర‌బాబు హ‌యాంలో చెల్లించిన‌ది ఇదీ..

చంద్ర‌బాబు హ‌యాంలో చెల్లించిన‌ది ఇదీ..

తొలి రోజు స‌భ‌లో సున్నా వ‌డ్డీ గురించి చేసిన వ్యాఖ్య‌ల‌కు భిన్నంగా జ‌గ‌న్ లెక్క‌ల‌ను వివ‌రించారు. చంద్ర‌బాబు హ యాం లో వ‌డ్డీ లేని రుణాల కింద చెల్లించిన మొత్తానికి సంబంధించిన లెక్క‌ల‌ను సంవ‌త్స‌రం వారీగా వివ‌రించారు. 2014-15 సంవ‌త్సారంలో వ‌డ్డీలేని రుణాల కింద చెల్లించాల్సింది 1186 కోట్లు ఉండ‌గా..44.31 కోట్లు చెల్లించార‌ని చెప్పు కొచ్చారు. అదే విధంగా 2015-16 లో ఇదే ప‌ద‌కం కింద చెల్లించాల్సి వ‌డ్డీ 2283 కోట్లు కాగా.. చెల్లించింది 31 కోట్లుగా వివ‌రించారు. 2016-17 లో వ‌డ్డీ కింద 2354 కోట్లు చెల్లించాల‌ని..అయితే 182 కోట్లు మాత్ర‌మే చెల్లించారని వెల్ల‌డించారు. ఇక‌, 2017-18 లో చంద్ర‌బాబు వ‌డ్డీ లేని రుణాల కింద ఏమీ చెల్లించ‌లేద‌ని చెప్పార‌ని..అయితే 3069 కోట్ల వ‌డ్డీ కింద చెల్లించాల్సి ఉండ‌గా..122 కోట్లు చెల్లించారంటూ స‌రి చేసారు. మొత్తంగా 11,595 కోట్లు చెల్లించాల్సి ఉండ‌గా..అందులో 630 కోట్లు మాత్ర‌మే చెల్లిస్తే..వ‌డ్డీ లేని రుణాలు రైతుల‌కు ఇచ్చిన‌ట్లా అని ప్ర‌శ్నించారు. ద‌మ్మిడి ఇవ్వ‌లేదు..రూపాయి ఇవ్వ‌లేద‌ని చెబుతూ ఉంటాం. ప్ర‌జ‌లను మోసం చేసారు కాబ‌ట్టే ఈ స్థాయిలో బుద్ది చెప్పారు.

జ‌గ‌న్ సెల్ఫ్ గోల్‌...ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో వైసీపీ

జ‌గ‌న్ సెల్ఫ్ గోల్‌...ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో వైసీపీ

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తొలి రోజు స‌భ‌లో స‌వాల్ చేయ‌గా..రెండో రోజు చంద్ర‌బాబు చెల్లించిన లెక్క‌ల‌ను తానే చెప్ప‌టం ద్వారా జ‌గ‌న్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం వ్య‌క్తం అయింది. మొత్తం చెల్లించ‌క‌పోతే రూపాయి చెల్లించ‌లే ద‌ని అంటారంటూ స‌మ‌ర్ధించుకొనే ప్ర‌య‌త్నం చేసారు. అయితే, చంద్ర‌బాబు తో స‌హా టీడీపీ ఎమ్మెల్యేల మాత్రం తొలి రోజు జ‌గ‌న్ చేసిన స‌వాల్ కు నిల‌బ‌డి రాజీనామా చేయాలి లేదా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేసారు. దీంతో..స‌భ‌లో గంద‌ర గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. స్పీక‌ర్ జోక్యం చేసుకొని స‌ర్ది చెప్పారు. స్పీక‌ర్ వద్ద‌న్నా.. ముఖ్య‌మంత్రి కోరి మ‌రీ చ‌ర్చ కొన‌సాగించి..చంద్ర‌బాబు వాద‌న‌నే ప‌రోక్షంగా స‌మ‌ర్ధించి ఇరుకున ప‌డ్డారు.

English summary
AP Cm Jagan Self goal in Assembly. On First day session CM Jagan challenged Chandra babu on Zero interest scheme. Cm Demanded for Chandra Babu resignation. But at last Jagan agreed that in Chandra babu Tenure also this scheme was implemented.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X