వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండు జిల్లాలపై జగన్ ఫోకస్: తన లక్ష్యం నెరవారాలంటే..ఇక : సక్సెస్ అవుతారా..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి జగన్ ఆ రెండు జిల్లాల మీదే ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఎవరు అధిక సీట్లు సాధిస్తే వారు అధికారంలోకి వస్తారు. అదే 2014లో జరిగింది. దానిని జగన్ 2019 ఎన్నికల్లో తన వైపు తిప్పుకోవటంతో అధికారంలోకి వచ్చారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని భావిస్తున్న జగన్..సామాజిక సమీకరణాల్లో మాత్రం పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే జగన్ సక్సెస్ కు కారణమైంది. ఇక, ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. పదవుల నుండి మొదలు పధకాల ప్రారంభం వరకు అక్కడే ఫోకస్ చేస్తున్నారు.

నెల్లూరు నేతలపై జగన్ సీరియస్: కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నారా: నేడు సీఎం వద్ద పంచాయితీ..!నెల్లూరు నేతలపై జగన్ సీరియస్: కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నారా: నేడు సీఎం వద్ద పంచాయితీ..!

అదే విధంగా అక్కడ తనకు దూరంగా ఉన్న వర్గాలను దగ్గర చేసుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాల నేతలను కలిపి తన పార్టీలో పని చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు ఓట్ బ్యాంక్ గా..ఒక ప్రధాన వర్గం తమతోనే ఉందని భావిస్తున్న పవన కు అదే విధంగా బీసీలు తమతో ఈ సారి ఎన్నికల్లో లేకపోయినా..భవిష్యత్ లో ఖచ్చితంగా తమతోనే వస్తారని ఆశిస్తున్న టీడీపీకి అవకాశం లేకుండా అక్కడ ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు.

రెండు జిల్లాలకు పదవులు..పధకాలు

రెండు జిల్లాలకు పదవులు..పధకాలు

ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఇచ్చిన తీర్పుతో జగన్ సీఎం అయ్యారు. దీంతో..రెండు జిల్లాలకు ఇద్దరు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. పశ్చిమ నుండి కాపు వర్గానికి ఇవ్వగా..తూర్పు నుండి బీసీ వర్గానికి చెందిన వారికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. ఆ ఇద్దిరినే ఆ రెండు జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులుగా నియమించారు. ఇక, కీలక పధకాల అమలు అక్కడి నుండే ప్రారంభిస్తున్నారు. ముక్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను తూర్పు గోదావరి నుండి ప్రారంభిస్తే.. వైయస్సార్ వాహన మిత్ర పధకాన్ని పశ్చిమ గోదావరి నుండి ఆరంభించారు. కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని తూర్పు గోదావరికి చెందిన ఎమ్మెల్యే రాజాకు అప్పగించారు.

రెండు పార్టీలకు అవకాశం లేకుండా..

రెండు పార్టీలకు అవకాశం లేకుండా..

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన తాజా ఎన్నికల్లో దెబ్బ తింది. స్వయంగా పవన్ పోటీ చేసినా ఓడిపోయారు. రెండు జిల్లాల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం అయింది. అదే విధంగా పశ్చిమలో 2014 ఎన్నికల్లో పవన్ సహకారంతో టీడీపీ ఏకంగా జిల్లా మొత్తాన్ని స్వీప్ చేసింది. వైసీపీకి ఒక్క సీటు దక్కలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో..ఎన్నికల్లో వచ్చిన బలంతో అక్కడ తన స్థానం సుస్ధిరం చేసుకొనేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సైతం కాపు నేతలకు అవకాశాలు కల్పించి ఏపీలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. అందుకు ఈ రెండు జిల్లాల నేతలు కీలకం కానున్నారు. అందులో భాగంగానే ఈ జిల్లాల నుండి వచ్చే నేతలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. భవిష్యత్ లో రెండు పార్టీలకు అవకాశం లేకుండా చేయాలని వ్యూహాలు అమలు చేస్తున్నారు. అయితే, జగన్ వ్యూహాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

 రెండు పార్టీలకు అవకాశం లేకుండా..

రెండు పార్టీలకు అవకాశం లేకుండా..

  • ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన తాజా ఎన్నికల్లో దెబ్బ తింది. స్వయంగా పవన్ పోటీ చేసినా ఓడిపోయారు. రెండు జిల్లాల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం అయింది. అదే విధంగా పశ్చిమలో 2014 ఎన్నికల్లో పవన్ సహకారంతో టీడీపీ ఏకంగా జిల్లా మొత్తాన్ని స్వీప్ చేసింది. వైసీపీకి ఒక్క సీటు దక్కలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో..ఎన్నికల్లో వచ్చిన బలంతో అక్కడ తన స్థానం సుస్ధిరం చేసుకొనేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సైతం కాపు నేతలకు అవకాశాలు కల్పించి ఏపీలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. అందుకు ఈ రెండు జిల్లాల నేతలు కీలకం కానున్నారు. అందులో భాగంగానే ఈ జిల్లాల నుండి వచ్చే నేతలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. భవిష్యత్ లో రెండు పార్టీలకు అవకాశం లేకుండా చేయాలని వ్యూహాలు అమలు చేస్తున్నారు. అయితే, జగన్ వ్యూహాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

English summary
AP Cm Jagan specially concentrated on Godavari dists to strenghten politically in that area. In last elections YCp got majority seats in both dists. jagan preparing cadre for local body elections winning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X