వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప‌రేష‌న్ క‌ర‌క‌ట్ట : జ‌గ‌న్ త‌రువాతి లక్ష్యం అయ‌నే: చ‌ంద్ర‌బాబు..ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య వార‌ధిగా..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆప‌రేష‌న్ క‌ర‌క‌ట్ట మొద‌లు పెట్టారు. చంద్ర‌బాబు క‌ళ్ల ముందే ఆయ‌న నిర్మించుకున్న సౌధాన్ని కుప్ప కూల్చారు. తొలుత ఈ రోజు నుండి కూల్చివేత ప్రారంభించాల‌ని భావించారు. ఎప్పుడైతే హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటీష‌న్ ఫైల్ అయిందో.. వెంట‌నే కూల్చివేత ప్రారంభించాల‌ని ఆదేశించారు. అంతే తెల్లారేస‌రికి దాదాపు కూల్చివేత పూర్త‌యింది. ప్ర‌జావేదిక త‌రువాత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి. క‌ర‌క‌ట్ట మీద ఎన్న ఉన్న కీల‌క వ్య‌క్తుల నిర్మాణాల పైన దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. ఆ నిర్మాణాల వెనుక రాజ‌కీయ కోణం ఉంది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా ఈ నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అప‌రేష‌న్ క‌ర‌క‌ట్ట‌...

అప‌రేష‌న్ క‌ర‌క‌ట్ట‌...

కృష్ణా న‌దీ ప్ర‌వాహం మీద నిబంధ‌ల‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న భవ‌నాల గురించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆరా తీసారు. అక్క‌డ నిర్మించిన భ‌వ‌నాలు రాజ‌కీయాంగానూ..ఇత‌ర రంగాల్లోనూ కీల‌క వ్య‌క్తులు. అయితే, వారంతా బీజేపీ..టీడీపీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న నేత‌లు గుర్తించారు. రాజ‌ధాని భ‌విష్య‌త్ కోస‌మే అని అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. గ‌తంలో ఇవే భ‌వ‌నాల గురించి గ‌తంలో ఇరిగేష‌న్ మంత్రి దేవినేని ఉమా స్వ‌యంగా..ఇవ‌న్నీ అక్ర‌మ నిర్మాణాల‌ని చెప్పిన విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో గుర్తు చేసారు. గ్రీన్ ట్రిబ్యున‌ల్ ఇచ్చిన తీర్పు..ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌ల అందోళ‌న గురించి వివ‌రించారు. రాజ‌ధాని నిర్మాణంలో ముందుగా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొలిగించాల‌ని..రైతులు ఇచ్చిన భూముల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని..అదే స‌మ‌యంలో..దొడ్డి దారిన నాటి అధికార పార్టీ నేత‌లు దక్కించుకున్న భూముల‌ పైనా జ‌గ‌న వివ‌రాలు కోరారు. ఇదే స‌మ‌యంలో క‌ర‌క‌ట్ట మీద ప్ర‌ముఖ‌లు భ‌వ‌నాల‌ను జ‌గ‌న్ ల‌క్ష్యంగా చేసుకున్నారు.

లింగ‌మ‌నేని భ‌వ‌నాలే ల‌క్ష్యంగా..

లింగ‌మ‌నేని భ‌వ‌నాలే ల‌క్ష్యంగా..

ప్ర‌జావేదిక కూల్చివేత పూర్తి కావ‌టంతో ఇక ఇప్పుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌రువాతి అడుగు రాజ‌ధాని ప్రాంతంలో రియ‌ల్ వ్యాపారంలో కీల‌కంగా ఉన్న లంగ‌మ‌నేని క‌ట్ట‌డాల పైన అధికారుల నుండి ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. గుం టూరు-విజ‌య‌వాడ మ‌ధ్య‌లో ప్ర‌ధానంగా క‌ర‌క‌ట్ట మీద లింగ‌మ‌నేని నిర్మాణాలు ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.
కృష్ణా క‌ర‌క‌ట్ట మీద స‌ర్వే నెంబ‌ర్ 271 లో 1.31 ఎక‌రాల్లో లింగ‌మేని అధునిక సౌక‌ర్యాల‌తో భ‌వ‌నం నిర్మించారు. నాలుగే ళ్లుగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇదే నివాసంలో ఉంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో వైసీపీ అనేక సార్లు చంద్ర‌బాబు అక్ర‌మ నివాసంలో ఉంటున్నార‌ని ఆరోపించారు. అదే ఇంట్లో ఉంటున్న చంద్ర‌బాబు దీనికి వెనుక గా స్విమ్మింగ్ పూల్..ప‌క్క‌నే హెలిపాడ్ వంటివి ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా న‌దిలోకి ఉండే ఈ నివాసం భ‌విష్య‌త్ లో ఇబ్బందులు సృష్టిస్తుంద‌ని అధికారులు నివేదించారు. గ‌తంలో చంద్రబాబు హాయంలో లింగ‌మ‌నేనికి వ్యాపార ప్ర‌యోజ‌నాలు క‌లిగించి..ఈ నివాసంలో కొన‌సాగారాని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

చంద్ర‌బాబు..వ‌ప‌న్ ల‌క్ష్యంగా..

చంద్ర‌బాబు..వ‌ప‌న్ ల‌క్ష్యంగా..

మాజీ ముఖ్య‌మంత్రి..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రికీ లింగ‌మ‌నేని సంస్థ నిర్వ‌హ‌కులు అత్యంత స‌న్నిహితు లుగా చెబుతారు. అందులో భాగంగానే.. రాజ‌ధాని ప్రాంతంలో అక్ర‌మ నిర్మాణంగా పేర్కొంటున్న ఇంటిని చంద్ర‌బాబు కు అప్ప‌నంగా ఇచ్చేసారు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాన్‌తోనూ స‌న్నిహితంగా ఉండేవార‌నేది వైసీపీ నేత‌ల ఆరోప‌ణ‌. 2017లో టీడీపీ..జ‌న‌సేన మ‌ధ్య ఉన్న స్నేహం బెడిసి కొట్టి..ప్ర‌త్యర్ది పార్టీలుగా మారాయి. ఇక‌..ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఎల‌క్ష‌న్ షెడ్యూల రాకముందే..టీడీపీ - జ‌న‌సేన మ‌ధ్య స్నేహం కోసం కొంద‌రు ప్ర‌ముఖులు ప్ర‌య‌త్నించారు. ఆ దిశ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేసారు. ప‌వ‌న్ మాత్రం స‌సేమిరా అన్నారు. ఆ స‌మ‌యంలో లింగ‌మేని క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌నేది జ‌గ‌న్ వ‌ద్ద ఉన్న స‌మ‌చారంగా వైసీపీ ముఖ్య నేత‌లు గుర్తు చేస్తున్నారు. క‌ర‌క‌ట్ట స‌మీపంలో పేరున్న సంస్థ‌గా లింగ‌మ‌నేని అక్ర‌మంగా నిర్మాణాలు చేపట్టిన వాటి పైనా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. దీని ద్వారా..ప‌రోక్షంగా చంద్ర‌బాబు..ప‌వ‌న్ రాజ‌కీయంగా మ‌ద్ద‌తిచ్చే వారిని ల‌క్ష్యంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంద‌నే వాద‌న‌లు మొద‌ల‌య్యాయి.

English summary
AP CM Jagan started OPeration Karakatta on Krishna branch in Undavalli. Jgan first focused on Prajavedika and next now on Lingamenni guest houses in this area which built by encroach.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X