• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ ఊహించని ట్విస్ట్: చంద్రబాబు అఫిడవిట్టే రివర్స్ ఆయుధంగా: అమిత్ షాతో ఏం జరిగింది...!!

|
  చంద్రబాబు అఫిడవిట్టే ఆయుధంగా మలుచుకున్న జగన్ || AP CM Jagan Submitted Key Documents To Central Govt

  ముఖ్యమంత్రి జగన్ టీడీపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రాజధాని అమరావతి పైన రగడ జరుగుతున్న సమయంలోనే కొత్త అడుగు వేసారు. ఇప్పటి వరకు మంత్రి బొత్సా చేస్తున్న వ్యాఖ్యలను తప్పు బడుతూ రాజకీయంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్న బీజేపీ..టీడీపీలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనకు ముందు ప్రధాని మోదీకి లేఖ రాసారు. అందులో రాజధాని గురించి కీలక సమాచారం ఇచ్చారు. ఇక, బొత్సా వ్యాఖ్యలతో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు మొదలు పెట్టాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో పోలవరం..రాజధాని గురించి తమ ఆలోచనలు..జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో సమర్పించిన ఒక అఫిడవిట్ ను జగన్ ఆయుధంగా మలచుకుంటున్నారు. దీనినే చంద్రబాబు పైన రివర్స్ అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమయ్యారు.

  జగన్ కు అస్త్రంగా చంద్రబాబు అఫిడవిట్..!!

  జగన్ కు అస్త్రంగా చంద్రబాబు అఫిడవిట్..!!

  రాజధానికి సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు వివరణ రూపంలో ఒక అఫిడవిట్ సమర్పించారు. అదే ఇప్పుడు జగన్ ఆయుధంగా మార్చుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నాడు సమర్పించిన అఫిడవిట్ తో పాటుగా గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలను వివరిస్తూ జగన్ ప్రభుత్వం ప్రధానికి లేఖ రాసినట్లు సమాచారం. రాజధాని నిర్మాణ ఖర్చు అనూహ్యంగా పెరిగిపోవడానికి, నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతుండటానికి కారణాలను పేర్కొంటూ ఈ వివరాలను అందచేసినట్లు తెలిసింది. రాజధానిపై తమ ప్రభుత్వమేమి కొత్త విషయాలను మాట్లాడటం లేదని, గత ప్రభుత్వం చెప్పిన అంశాలనే ప్రస్తావిస్తున్నామని ఈ లేఖ లో పేర్కొన్నట్లు తెలిసింది. రాజధాని ముంపు సమస్య, పర్యావరణవేత్తల అభ్యంతరాలు, ఉన్నత న్యాయస్థానం, గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటి షన్లు, వాటిపై అప్పటి ప్రభుత్వ వాదనలను వివ రించిన ముఖ్యమంత్రి ఆ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఇదే లేఖను ఇవ్వటంతో పాటుగా రాజధాని పైన తమ ఉద్దేశం..పరిపాలనా వికేంద్రీకరణ గురించి వివరించినట్లు విశ్వసనీయ సమాచారం.

  టీడీపీ ప్రభుత్వ అఫిడవిట్ లో ఏముంది..??

  టీడీపీ ప్రభుత్వ అఫిడవిట్ లో ఏముంది..??

  తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజ ధానిగా ప్రకటించిన సమయంలో పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీనిపై అప్పట్లో కొందరు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వివరణ కోరగా, భారీ వరదలొస్తే 13 వేల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ముంపునకు గురవుతాయని ప్రభుత్వం పేర్కొంది. 29 గ్రామాల పరిధిలో 34 వేల ఎకరాలు సేకరించగా అందులో మూడవ వంతుకు మాత్రమే ముంపు ప్రమాదం ఉందని, దానిని కూడా నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. నది గర్భం నుండి 25 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు చేపడతామని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం హామీ ఇచ్చింది. సమాచారం. ముంపు నకు గురయ్యే ప్రాంతాల్లోని చంద్రబాబు శాశ్వత పరిపాలన భవనాలకు శంకుస్థాపన చేశారని, ముంపు బారి నుండి తప్పించడానికి వంద అడు గుల లోతులో ర్యాప్టు ఫౌండేషన్‌ టెక్నాలజీతో 40 నుంచి 50 టవర్ల భవనాలు ఐదింటిని నిర్మించేం దుకు పనులు ప్రారంభించారని, ఫలితంగా ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని వివరించారు. ఇటీ వల వచ్చిన వరదతో రాజధానిలోని కీలక ప్రాంతా లపై బోరుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల్లోని నదీపరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని వివరించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు.

  అమిత్ షాకు జగన్ చెప్పిందేంటి..!!

  అమిత్ షాకు జగన్ చెప్పిందేంటి..!!

  అమెరికా పర్యటన నుండి వచ్చిన తరువాత జగన్ ఏపీలో నెలకొన్ని పరిస్థితులు..పోలవరంతో పాటుగా రాజధాని పైన రాజకీయంగా సాగుతున్న రగడ పైన పూర్తి సమాచారం సేకరించారు. ఇదే సమయంలో పోలవరం గురించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల పైన నేరుగా కేంద్రంతోనే చర్చించాలని జగన్ నిర్ణయించారు. హోం మంత్రి అమిత్ షాకు పోలవరం పైన వేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన ప్రాధమిక నివేదిక ను అమిత్ షా కు వివరించారు. అదే విధంగా రాజధానిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని..అక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదని గత ప్రభుత్వం బయటకు చెప్పక పోయినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమర్పించిన అఫిడవిట్ ను ప్రధానికి సైతం అందించిన విషయాన్ని వివరిస్తూనే..అమిత్ షాకు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంల రాజధానిలో జరిగిన అవినీతి గురించి ముఖ్యమంత్రి వివరించారని చెబుతున్నారు. దీనికి సంబంధించి జరిగిన లావా దేవీలను సైతం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనని అమిత్ షా సైతం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక, ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 29న రాజధాని వ్యవహారం పైన ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP CM jagan submitted key affadavit which filed before NGT by Chandra Babu govt to central Govt. Jagan also discussed with Amith Shah about Polavaram Reverse tendering and Capital controversy. CM also met central Jalashakthi minister Shekawath.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more