వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స‌చివాల‌యంలో బాధ్య‌తల స్వీక‌ర‌ణ : తొలి మూడు సంత‌కాలు ఇవే: అధికారుల‌తో ఇలా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

స‌చివాల‌యంలో జ‌గ‌న్ చేసిన.. తొలి మూడు సంత‌కాలు ఇవే..! || Oneindia Telugu

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌రిగ్గా నిర్ణ‌యించిన ముహూర్తానికే స‌చివాల‌యంలో తొలి సారిగా అడుగు పెట్టారు. 8.39 గంట‌ల‌కు స‌చివాల‌యంలోని తొలి బ్లాక్‌లో ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప్ర‌వేశించారు. వేద పండితుల ఆశీర్వాదంతో ముఖ్య‌మంత్రి సీట్లో ఆసీనుల‌య్యారు. ఆ వెంట‌నే మూడు కీల‌క ఫైళ్ల పైన సంత‌కాలు చేసారు. అధికారులు..కాబోయే మంత్రులు.. పార్టీ నేత‌లు..ఉద్యోగులు ముఖ్య‌మంత్రిని క‌లిసి అభినందించారు. త‌న తండ్రి చిత్ర ప‌టానికి నివాళి అర్పించి త‌న బాధ్య‌త‌లు ప్రారంభించారు.

స‌రిగ్గా 8.39 గంట‌ల‌కు బాధ్య‌త స్వీక‌ర‌ణ‌..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌చివాల‌యంలో అధికారికంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఘ‌న స్వాగ‌తం ల‌భించారు. ఆ వెంట‌నే మొద‌టి బ్లాక్‌లో ప్ర‌వేశించారు. అక్క‌డ శృంగేరీ మ‌ఠం నుండి వ‌చ్చిన వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వ‌గా..ఆ వెంట‌నే త‌న తండ్రి చిత్ర ప‌టానికి నివాళి అర్పించి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న బాధ్య‌తలు స్వీక‌రించిన వెంట‌నే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం..డీజీపీ గౌతం స‌వాంగ్ స్వీటు ఇవ్వ‌బోగా..ఆయ‌నే తిరిగి వారికి స్వీటు తినిపించారు. ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారుడు అజ‌య్ క‌ళ్లాం, కార్యాల‌య అధికారులు..పార్టీ నేత‌లు.. స‌చివాల‌య ఉద్యోగ సంఘాల నేత‌లు..కాబోయే మంత్రులు..ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. జ‌గ‌న్ త‌న వ‌ద్ద‌కు ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

AP CM Jagan taken charge officially in Secretariat at his chamber. Jagan signed on three files after taken charge

తొలి మూడు సంత‌కాలు ఇవే...

ముఖ్య‌మంత్రిగా స‌చివాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌గానే మూడు ఫైళ్ల పైన సంత‌కాలు చేసారు. అందులో తొలి సంత‌కం ఆయ‌న ప్ర‌క‌టించిన న‌వ ర‌త్నాల్లో భాగంగా ఇప్ప‌టికే ప్ర‌కటించిన విధంగా ఆశా వ‌ర్క‌ర్ల‌కు జీతం మూడు వేల నుండి పది వేల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. అమ‌రావ‌తి ఎక్స్‌ప్రెస్ హైవేకు అనుమ‌తి కోరుతూ కేంద్రానికి నివేదిస్తూ రెండో సంత‌కం చేసారు. ఇక‌, కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న జ‌ర్న‌లిస్ట్ ఆరోగ్య ప‌ధ‌కానికి సంబంధించిన ఫైల్ పైన మూడో సంత‌కం చేసారు. జర్న‌లిస్టు భీమా 10ల‌క్ష‌ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.ఉద్యోగ సంఘాల నేత‌లు తాము క‌లిసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర‌గా.. జ‌గ‌న్ ఈ రోజే మాట్లాడుతానంటూ హామీ ఇచ్చారు. అదే స‌మ‌యంలో అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆప్యాయంగా ప‌ల‌క‌రించి వారి నుండి శుభాకాంక్ష‌లు అందుకున్నారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ సమావేశం ద్వారా ఇక సచివాల‌యం వేదిక‌గా త‌న పాల‌న కొన‌సాగించ‌నున్నారు.

English summary
AP CM Jagan taken charge officially in Secretariat at his chamber. Jagan signed on three files after taken charge. Jagan to meet with all secretary's in secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X