అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్..అమిత్ షాతో భేటీ: ఏం జరగబోతోంది..?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న విషయాలు, రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర పెద్దలకు వివరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. రేపు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు అదే సమయంలో రాష్ట్రంలో కరోనావైరస్ పరిస్థితి రాష్ట్రానికి సంబంధించి ఇతర ఆర్థిక పరమైన అంశాలను కూడా అమిత్ షా ముందు ప్రస్తావించనున్నట్లు సమాచారం.

Recommended Video

AP CM Jagan Will Meet Modi & Amit Shah On Tuesday To Discuss Key Issues

 2021లో ఉప ఎన్నికల కోసం వైఎస్ జగన్ భారీ స్కెచ్: పావులు కదుపుతున్నారంటోన్న వైసీపీ 2021లో ఉప ఎన్నికల కోసం వైఎస్ జగన్ భారీ స్కెచ్: పావులు కదుపుతున్నారంటోన్న వైసీపీ

 జగన్- అమిత్ షా భేటీ

జగన్- అమిత్ షా భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో మంగళవారం భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చించనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ అప్పాయింట్‌మెంట్ కూడా సీఎం జగన్ కోరినట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తిగా స్పష్టత లేదు. ఆ అపాయింట్‌మెంట్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అమిత్ షాతో భేటీ సందర్భంగా ఏపీ నిఘా మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంను ప్రస్తావించనున్నట్లు సమాచారం.

 ఏబీ సస్పెన్షన్ వ్యవహారంపై...

ఏబీ సస్పెన్షన్ వ్యవహారంపై...

ఏబీని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నాడు హోంశాఖ కూడా మద్దతు తెలిపింది. అదే సమయంలో క్యాట్ కూడా ఏబీ సస్పెన్షన్‌ను సమర్థించింది. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంకటేశ్వరరావుకు ధర్మాసనం భారీ ఊరటను కల్పిస్తూ తీర్పు చెప్పింది. తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

 రవిశంకర్ ప్రసాద్‌తో కూడా సమావేశం..?

రవిశంకర్ ప్రసాద్‌తో కూడా సమావేశం..?

అమిత్ షాతో భేటీ తర్వాత జగన్ కేంద్రన్యాయశాఖ మంత్రితో సమావేశం కానున్నట్లు సమాచారం. ఆయన వద్ద ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులను ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఇక నిమ్మగడ్డ వ్యవహారంతో పాటు ఇతర అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయితే ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చేందుకు సీఎం ప్రిపేర్ అయినట్లు సమాచారం. కరోనావైరస్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా తయారైందని ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని సీఎం ప్రధానిని కోరే అవకాశం ఉంది. అదే సమయంలో పోతిరెడ్డిపాడు అంశం కూడా ప్రధాని దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.

English summary
AP CM YS Jagan will meet Union Home Minister Amit Shah tommorow if sources are to be believed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X