వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ఏపీ సీఎం జగన్‌: జెట్ స్పీడ్ తో పనులు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు .ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పర్యవేక్షించనున్నారు .వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరానికి జగన్‌ వెళ్లడం ఇది రెండోసారి. ఉదయం 10 గంటల 50 నిమిషాలకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న సీఎం జగన్ పనుల పురోగతిపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను శరవేగంగా పూర్తి చెయ్యాలని సంకల్పిస్తున్న ఆయన మధ్యాహ్నం పన్నెండున్నర వరకూ పోలవరంలోనే ఉండి పనులను పరిశీలిస్తారు .

వైఎస్సార్ శ్రీకారం చుట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ పై సీఎం జగన్ ఫోకస్ .. నేడు సందర్శనవైఎస్సార్ శ్రీకారం చుట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ పై సీఎం జగన్ ఫోకస్ .. నేడు సందర్శన

 పోలవరం పనులు పరిశీలించనున్న జగన్ ... అధికారులతో సమీక్ష

పోలవరం పనులు పరిశీలించనున్న జగన్ ... అధికారులతో సమీక్ష

పనుల పర్యవేక్షణ అనంతరం ఇరిగేషన్‌, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో భేటీ అయి పనులపై రివ్యూ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఇటు అధికారులు గట్టి బందోవస్తు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించే ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లపై రివ్యూ చేస్తున్నారు. ఇక మరో పక్క ఈరోజు శుక్రవారం కావటంతో సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు కావలసి ఉంది. మరి ఆయన పోలవరం పర్యటనకి వెళుతుండడంతో కోర్టుకు హాజరు కాక పోవచ్చని తెలుస్తుంది .

 సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేస్తామన్న జగన్

సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేస్తామన్న జగన్

ఇక ఇటీవల జరిగిన రాజధాని విషయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా పోలవరంపై క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఒక్క సంవత్సరంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని చెప్పారు. పోలవరం నిర్మాణంపై ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలకు దిమ్మదిరిగే సమాధానం చెప్పాలని భావించిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు . సీఎం జగన్ ఏపీ కలల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా ఏకంగా 830 కోట్ల రూపాయలు ఆదా చేశామని ప్రకటించారు.

Recommended Video

Mekapati Gowtham Reddy Conducts Review Meeting In Amaravathi | Oneindia Telugu
పనుల్లో వేగం ... ప్రాజెక్ట్ పై సీఎం దృష్టి

పనుల్లో వేగం ... ప్రాజెక్ట్ పై సీఎం దృష్టి

2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఆయన అసెంబ్లీలో తెలిపారు. 2021లో రైతుల కరువు తీరుస్తామని, రైతులకు నీళ్లు ఇస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామని చెప్పిన జగన్ పనుల్లో స్పీడ్ పెంచి త్వరిత గతిన పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల లో పూర్తి చేయని ప్రాజెక్టు ను ఏడాది లోనే పూర్తి చేస్తామని చెప్పిన నేపద్యంలోనే సీఎం జగన్ పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

English summary
AP CM Jagan Mohan Reddy will visit the Polavaram Project .He will oversee the work of the Pollavaram Project .This is the second time the YCP has come to power. The aerial survey will be conducted on the progress of the polavaram works , which will arrive at the project in 10. 50 minutes. He intends to complete the Polavaram project quickly and stay in Polavaram till 12 noon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X