వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బాబాయి వివేకా హత్యకేసు -సీబీఐ అదుపులో సునీల్‌ యాదవ్ -గోవాలో నిర్బంధం?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది..

వివేకానంద హత్య జరిగి రెండేళ్లయినా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా నిందితులను పట్టుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని కుటుంబీకులు అనుమానించడం, జగన్ ప్రోద్బలంతోనే వివేకా హత్య జరిగుంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండటం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ కీలక అడుగుగా సునీల్ యాదవ్ ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి..

ap-cm-jagan-uncle-ys-viveka-murder-case-cbi-reportedly-nabs-key-accused-sunil-yadav-in-goa

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ముందు నుంచీ కీలక అనుమానితుడిగా ఉన్నాడు. అయితే విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని సునీల్‌ ఆ మధ్య హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం పులివెందులలో తమ నివాసానికి తాళం వేసి సునీల్ కుటుంబమంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సునీల్‌ గోవాలో ఉన్నట్లు తెలియడంతో సీబీఐ బృందం అక్కడకు వెళ్లి సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య దర్యాప్తును తలకెత్తుకున్న సీబీఐ కొన్నాళ్లు విచారణ జరిపి కరోనా కారణంగా ఆపేసి, రెండో దఫా దర్యాప్తుపే ప్రారంభించి, కడప కేంద్ర కారాగారం కేంద్రంగా 57 రోజులుగా విచారణ జరుపుతున్నది. అందులో భాగంగా పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సునీల్ కుమార్ యాదవ్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. దీనిని అరెస్టుగా చూపుతారా లేదా అనేది ఇంకొద్ది గంటల్లో వెల్లడికానుంది.

ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమరరాజా -చిత్తూరు నుంచి చెన్నైకి బ్యాటరీ ప్లాంట్ -గల్లా జయదేవ్ సంచలనం, స్టాలిన్ ఓకే?ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమరరాజా -చిత్తూరు నుంచి చెన్నైకి బ్యాటరీ ప్లాంట్ -గల్లా జయదేవ్ సంచలనం, స్టాలిన్ ఓకే?

Recommended Video

Spl Report on YSR TP Parliamentary Committee Statement

సునీల్ కుమార్ యాదవ్ దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకాకు సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆయన హత్యకేసులో భాగంగా సీబీఐ అధికారులు సునీల్ కుమార్ యాదవ్‌తోపాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. అయితే ఇటీవలే వాచ్‌మెన్ రంగన్న సునీల్ కుమార్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో సునీల్ కుమార్ యాదవ్ ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించారు.

English summary
More than two years after the grisly murder of YS Vivekananda Reddy, the brother of former Andhra Pradesh Chief Minister YS Rajasekhara Reddy, the main accused in the case has been caught by the Central Bureau of Investigation (CBI). The agency's officials in a search operation caught Sunil Yadav in Goa today. Process to arrest him and produce him in court is underway, agency, media reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X