వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలగించిన చోటే వైఎస్ విగ్రహం.. టీడీపీ తొలగిస్తే, వైసీపీ పున:ప్రతిష్టించింది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ : ప్రభుత్వాలు మారితే పథకాలు, పేర్ల మార్పు సహజమే. కొన్ని సార్లు విగ్రహాలను కూడా తీసి .. పక్కన పెట్టేశారు. దేశంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించింది. దీనిపై అప్పటి ప్రతిపక్షం గగ్గొలు పెట్టిన పెడచెవిన పెట్టింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో సహజంగా జరిగే ప్రక్రియ జరిగింది.

విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం వద్ద 2011లో అప్పటి కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వైఎస్ఆర్ విగ్రహన్ని ఆవిష్కరించారు. అప్పటినుంచి విగ్రహం అక్కడే ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారం చేపట్టింది. దీంతో పుష్కరాల అభివృద్ధి పనుల సమయంలో అడ్డొస్తోందని వైఎస్ విగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే చేలరేగింది. కానీ అప్పటి సర్కార్ పట్టించుకోలేదు. వైఎస్ విగ్రహాన్ని కంట్రోల్ రూం పక్కన ఉన్న అగ్నిమాపక కార్యాలయంలో ఉంచారు.

ap cm jagan unveil ysr statue

ఇక అప్పటినుంచి వైఎస్ విగ్రహం అగ్నిమాపక కార్యాలయంలోనే ఉంచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జయభేరీ మోగించింది. ఇంకేముంది వైఎస్ విగ్రహా పున: ప్రతిష్టపై ఫోకస్ చేసింది. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ సీఎం జగన్ .. వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

English summary
YSR statue was unveiled by the then Congress MP Lagadapati Rajagopal at the Vijayawada Police Control Room. The statue has been there ever since. But after the division of the state, TDP took over power. The YSR statue has been removed by the Chandrababu government. But then govt did not care. The YSR statue was placed in the fire office next to the control room. today ap cm jagan unveil ysr statue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X