వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ డెడ్‌లైన్‌: ఎమ్మెల్యేల‌కు తేల్చి చెప్పేసారు: ముఖ్య‌మంత్రి హెచ్చరికల వెనుక‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఇంకా రెండు నెల‌లు కూడా పూర్తి కాలేదు. మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేసి 35 రోజు లు అయింది. అప్పుడే మ‌ఖ్య‌మంత్రి నుండి హెచ్చ‌రిక‌లు మొద‌ల‌య్యాయి. ఏకంగా వారికి డెడ్‌లైన్ విధించారు. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల‌ను సైతం జ‌గ‌న్ వ‌ద‌ల్లేదు. స‌మ‌ర్ధ‌త నిరూపించుకోకుంటే ప‌క్క‌న పెడ‌తామంటూ సూటిగా సీఎం స్ప‌ష్టం చేసారు. దీంతో..పాటుగా ప‌రోక్షంగా ముఖ్య‌మంత్రి సుతి మెత్త‌గా చేసిన హెచ్చ‌రిక‌లు..అస‌లు జ‌గ‌న్ ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వ‌టం వెనుక అస‌లు కార‌ణం ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది.

అవకాశం సద్వినియోగం చేసుకోండి..లేకుంటే అంతే..

అవకాశం సద్వినియోగం చేసుకోండి..లేకుంటే అంతే..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మంత్రులు..సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. స‌భ‌లో ప్ర‌తిప‌క్షం ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని చూస్తోంద‌ని..దీనిని తిప్పి కొట్ట‌టంలో మంత్రులు క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం నిర్దేశించారు. ప్ర‌తీ మంత్రి పని తీరు గురించి త‌న వ‌ద్ద స్ప‌ష్ట‌మైన స‌మ‌చారం ఉంద ని చెబుతూనే.. ఇప్ప‌టికే కొంద‌రికి కొన్ని సూచ‌న‌లు చేసాన‌ని..వాటి ద్వారా స‌రిదిద్దుకోక‌పోతే ఏమీ చేయ‌లేమ‌ని జ‌గ‌న్ చాలా సుతి మొత్త‌గా త‌న ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యంలో మంత్రులు అయిదేళ్లు ప‌ద‌విలో కొన‌సాగాలంటే సాధ్యం కాద‌ని..ఇప్పుడున్న 25 మందిలో కేవ‌లం 80 నుండి 85 శాతం వ‌ర‌కు మంత్రులు మాత్ర‌మే కొన‌సాగుతార‌ని.. రెండున్నారేళ్ల త‌రువాత కొత్త వారికి అవ‌కాశం ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి మ‌రో సారి తేల్చి చెప్పారు. మంత్రులుగా వ‌చ్చిన అవ‌కాశం స‌ద్వినియోగం చేస‌సుకోవాలంటూ ముఖ్య‌మంత్రి చెప్పిన వ్యాఖ్య‌లు వారిలో టెన్ష‌న్ పుట్టిస్తున్నాయి.

Recommended Video

ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తా-జగన్
ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్ చెప్పింది విన్నాక‌..c

ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్ చెప్పింది విన్నాక‌..c

ఇదే స‌మావేశంలో పార్టీ ఎమ్మెల్యేల‌కు సీఎం చుర‌క‌లు వేసారు. కొంద‌రు ఎమ్మెల్యేలే స‌భ‌లో యాక్టివ్‌గా ఉంటున్నార‌ని.. మిగిలిన వారు ఎందుకు నిర్లిప్త‌తో ఉంటున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. స‌భ‌లో జ‌రిగే చ‌ర్చ‌ల గురించి పూర్తి స‌మాచారం తో రావాల‌ని చెబుతూనే.. కొంద‌రు ఎమ్మెల్యేల తీరు పైన ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. ఎమ్మెల్యేల‌కు తొలి పార్టీ స‌మావేశం లోనే మ‌న ల‌క్ష్యం ఏంటో స్ప‌ష్టం చేసాన‌ని..అయినా కొంద‌రు ఎమ్మెల్యే తీరు పైన ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని దీనిని ఉపేక్షించేది లేద‌ని తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్ర‌భుత్వంలో..పార్టీలో స‌మ‌ర్ధ‌వంతంగా త‌మ పాత్ర పోషించిన వారికే తిరిగి 2024లో సీట్లు ఉంటాయ‌ని..లేకుంటే ఎట్టి ప‌రిస్థితుల్లో వారికి అవ‌కాశం ఉండ‌ద‌ని నిర్మొహ‌మాటంగా సీఎం జ‌గ‌న్ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ప్ర‌కాశం..అనంత‌పురం జిల్లాలోని కొంద‌రు ఎమ్మెల్యేల తీరు పైన నిఘా వ‌ర్గాలు రెండు రోజుల క్రితం ముఖ్య‌మంత్రికి ఇచ్చిన స‌మాచారం ఆధారంగా సీఎం ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు భావిస్తున్నారు.

క‌ఠినంగానే ఉండాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం..

క‌ఠినంగానే ఉండాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం..

ముఖ్య నేత‌ల స‌మావేశంలో జ‌గన్ త‌న వైఖ‌రిని ముఖ్య‌మంత్రి స్పష్టం చేసారు. 151 సీట్టు క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌ల‌కు జ‌వాబు దారీగా ఉండాల‌ని..సంజాయిషీ ఇచ్చుకొనే ప‌రిస్థిలో మాత్రం ఉండ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ ఖ‌చ్చితంగా చెప్పారు. అదే స‌మ యంలో ఎవ‌రైనా విధానాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తే ఎటువంటి నిర్ణ‌యానికైనా వెనుకాడ‌న‌ని తేల్చి చెప్పారు. అదే విధంగా ప్ర‌భుత్వం..పార్టీకి అధినేత‌గా ఉన్న తాను ఖ‌చ్చితంగా క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తాన‌ని..కొంత స‌మ‌యం వ‌ర‌కు మాత్ర‌మే వేచి చూసే ధోర‌ణి ఉంటుందంటూ వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. దీంతో..ముఖ్య‌మంత్రి ప‌రోక్షంగా పార్టీ లోని ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో కొంద‌రి వైఖ‌రిపైన జ‌గ‌న్ వ‌ద్ద స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఉంద‌ని.. దీని ఆధారంగానే సీఎం మాట్లాడార‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఇప్పుడు సీఎం చేసిన కామెంట్లు పార్టీలో..ప్ర‌భుత్వంలో హాట్ టాపిక్‌గా మారాయి.

English summary
AP CM Jagan Warned Ministers and MLA's to work with unite and face opposition in Assembly. If any body lapse in their performance they will loose option in Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X