అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను తెలుసుకున్నా: టాటా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లో రతన్ టాటాతో చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో బిజీగా ఉన్నారు. పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని ఆవాసయోగ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని, ఏపీలో మొబైల్ తయారీని రెండింతలు పెంచే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఏపీలో పర్యాటక రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు.

బీఎస్‌ఈలో అమరావతి బాండ్లు ప్రారంభం, గంటకొట్టిన బాబు: మళ్లీ తెలంగాణబీఎస్‌ఈలో అమరావతి బాండ్లు ప్రారంభం, గంటకొట్టిన బాబు: మళ్లీ తెలంగాణ

రతన్ టాటాతో చర్చ

ముంబైలోని టాటా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ కంపెనీల అధినేత రతన్ టాటా, టీసీఎస్ సీఈవో నటరాజన్ చంద్రశేఖరన్‌లను కలిశారు. ఏపీలో పెట్టుబడుల అంశంపై వారి మధ్య చర్చ జరిగింది.

వారి నుంచి తెలుసుకున్నా

భారతదేశ అభివృద్ధిలో టాటా ట్రస్ట్ పాత్ర ఎంతో ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. బాంబే హౌస్‌లోని టాటా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన తాను అక్కడి వారి నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని చెప్పారు.

1.53 రెట్లు.. గర్వకారణం

కాగా, అంతకుముందు రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బీఎస్‌ఈలో సోమవారం నమోదు చేశారు. చంద్రబాబు గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌పై బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరాయి. అవి బీఎస్‌ఈలో సోమవారం లిస్టింగ్‌ అయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి బ్రాండ్ అనేది ఏ రేంజ్‌లో ఉందనేది మనం ఇష్యూ చేసిన బాండ్లకు వస్తోన్న స్పందన బట్టి అర్థమౌతోందని, ఇప్పటికే 1.53 రెట్లు అధికంగా అమ్ముడుబోయి 2వేల కోట్లు సమీకరించబడ్డాయని, ప్రజారాజధాని అమరావతిపై ఇన్వెస్టర్లు చూపిస్తున్న అభిమానం నిజంగా గర్వకారణం అన్నారు.

Recommended Video

బీఎస్‌ఈలో అమ‌రావ‌తి బాండ్ల లిస్టింగ్

బాండ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా

అమరావతి బాండ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన రాజధాని విశిష్టత, గొప్పతనం ప్రచారంలోకి వస్తోందని, తద్వారా మరింత స్పందన వచ్చి ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరుతాయని, మనం అనుకున్న రాజధానిని సకాలంలో నిర్మించగలుగుతామని చంద్రబాబు అన్నారు. ఒక కొత్త రాజధానిని నిర్మించడం అనేది జీవితకాలంలో వచ్చే ఒక అరుదైన అవకాశమని, డబ్బు లేనంత మాత్రాన ఏదీ ఆగదని, సంకల్పం ఉంటే చాలునని, ల్యాండ్ పూలింగ్‌తో 33800 ఎకరాలు కేవలం నమ్మకం మీద రైతులు ఈ ప్రభుత్వానికి అప్పగించారని, ఇప్పుడు అదే విశ్వాసం అమరావతి బాండ్లపై వస్తున్న స్పందన ప్రతిబింబింస్తోందన్నారు. అనంతరం చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.

English summary
Glad to see the efforts put in by tatatrusts for development of India. During my visit to Tata Experience Centre, Bombay House, I was explained about various initiatives taken up by them across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X