సోషల్ మీడియాలో సీఎం బాబుకు పాపులారిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌తో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు. చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో 4.3 లక్షల మంది ఫాలోవర్స్‌తో హవా కొనసాగిస్తున్నాడు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఇటీవల యువత అభిరుచులు, మనోభావాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ హ్యాంగ్‌వుట్ ద్వారా కలుసుకున్న కార్యక్రమానికి భారీగా ప్రజాదరణ లభిస్తోంది. డిసెంబర్ 20న జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరోజు టీవీ, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రసారం చేశారు.

గూగుల్ హ్యాంగ్‌వుట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు "స్కిల్ డెవలప్మెంట్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్" గురించి చర్చించారు. ఇప్పటి వరకు ఆ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో 2,94,62,648 మంది వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతా నుంచి 2,10758 మంది చూడటం గమనార్హం.
దేశ విదేశాల అడిగిన సుమారు 800 ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానాలు తెలపడం జరిగింది. అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆ ప్రశ్నలను పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేస్‌బుక్ ఖాతాకు 3,38,114 మంది ఫాలోవర్స్ ఉండగా... ట్విట్టర్‌లో 4,37,696 మంది ఫాలోవర్స్ ఉన్నారు.












Click it and Unblock the Notifications