వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ సక్సెస్ చెయ్యటానికి ఏపీ సీఎం సూపర్ ఐడియా .. అదేంటంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పై దేశం పోరాటం ప్రకటించింది. దేశంలో తీవ్రంగా కరోనా వైరస్ మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షట్ డౌన్ చేశారు. ఎవరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దని చెప్పారు. మార్చి 31 వరకు ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు.

 లాక్ డౌన్ సక్సెస్ చెయ్యటం కోసం ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం

లాక్ డౌన్ సక్సెస్ చెయ్యటం కోసం ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం

కరోనా భయం పొంచి ఉన్న నేపధ్యంలో రోడ్డెక్కకుండా ఇంట్లోనే ప్రజలను ఆపటం కష్టసాధ్యంగా మారింది. ఇక ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లాక్ డౌన్ సక్సెస్ చెయ్యటం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతే కాదు విదేశాల నుండి వచ్చిన వారిని శత్రువుల్లాగా చూడవద్దని అన్నారు. విదేశాల నుండి వచ్చిన వారు బాధ్యత తీసుకుని అధికారులకు ఎక్కడున్నారో సమాచారం ఇవ్వాలని, కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలనిపిలుపునిచ్చారు. ఇక హై రిస్క్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని, లక్షణాలు ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారు మాస్కులు వాడితే సరిపోతుందని చెప్పారు.

నిత్యావసరాల కోసం బయటకు రాకుండా సీఎం జగన్ నిర్ణయం

నిత్యావసరాల కోసం బయటకు రాకుండా సీఎం జగన్ నిర్ణయం

ఇక ప్రభుత్వం లాక్ డౌన్ పాటిం చాలని ప్రాణాలను కాపాడుకోండి అని ప్రభుత్వం చెబుతున్నా వినకుండా నిత్యావసరాల కోసం రోడ్డుపైకి వస్తున్నారు. కరోనా కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో మరింత రిస్కు పెంచుతున్న వారి కోసం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు అమలైతే నిత్యావసరాల కోసం ఎవరూ రోడ్డు మీదకు రానక్కరలేదు. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు వారి వద్దకే చేర్చే ఆలోచన చేస్తుంది ఏపీ సర్కార్ .

సరుకులు, కూరగాయలు తోపుడుబండ్ల మీదే ఇంటింటికి చేర్చాలని ఆదేశం

సరుకులు, కూరగాయలు తోపుడుబండ్ల మీదే ఇంటింటికి చేర్చాలని ఆదేశం

ప్రజలు బయటకు వస్తూ సరుకుల కోసమో, కూరగాయల కోసమో అని సాకులు చెబుతున్నారు. అయితే వారిలో కొందరు నిజంగానే సరుకులు, కూరగాయలకు వస్తున్న క్రమంలో ప్రతీ కాలనీలోని కూరగాయలు, నిత్యావసర సరుకులను తోపుడు బళ్లపై విక్రయించేలా ఆదేశాలు జారీ చేసారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి . ఇక ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా తోపుడు బళ్లపై నిత్యావసరాలను విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పివి రమేష్ తెలిపారు.

English summary
People come out and make excuses for the sake of goods and vegetables. Chief Minister Jagan Mohan Reddy, however, ordered some of them to sell vegetables and essential commodities in every colony in order to arrive at the goods and vegetables. In this context, Andhra Pradesh Additional Chief Secretary PV Ramesh said that arrangements have been made to sell necessities across the state in keeping with the Chief Minister's orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X