వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పాలన సగం అంతమైంది, జనరంజకమైన జగన్ పాలన రాబోతుంది : బోత్స

|
Google Oneindia TeluguNews

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబునాయుడు అధికారిక సమీక్షలు ఎలా నిర్వహిస్తారని వైసీపి నేత బోత్స సత్యనారయణ ప్రశ్నించారు. కోడ్ అమలులో ఉన్న సమయంలోనే 18 కాన్ఫిడెన్షియల్ జీవోలను విడుదల చేశారని ఆయన అన్నారు. కాగా చంద్రబాబు ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నారని అందుకే ఈసీతొ పాటు అన్నివ్వవస్థలు సైతం తన చెప్పుచేతల్లోనే ఉండాలని భావిస్తున్నారని విమర్శించారు.

ఈ సంధర్భంలోనే చంద్రబాబు నాయుడుకు ఆయన మీద తప్ప, ఏ వ్యవస్థల మీద నమ్మకం లేదన్నారు . చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ఆయన పాలన సగం అంతమైందని, ఇక జనరంజకమైన జగన్ పాలన రాబోతుందని అన్నారు.. వైసీపీ నేతలతో టచ్ లో ఉండండి అంటూ తన నాయకులకు చెబుతున్న చంద్రబాబును ప్రజలు రాళ్లతో కొడతారు.

ap cm voilated election code, Botsa satyanarayana

ప్రజాస్వామ్యం అంటే అంతా తమాశ గా ఉందా అంటూ మండిపడ్డారు. పాత బకాయిలు వసూలు చేసుకోవాడానికి మళ్లి అధికారంలోకి వస్తానని ఇంకా కార్యకర్తలను మభ్య పెడుతున్నారని అన్నారు. ఏం జరగనుందో ఆయన ఇంటలిజెన్స్ అధికారులకు కూడ తెలుసని అన్నారు, కొద్ది రోజుల్లో ప్రభుత్వ లీలలు అన్ని బయటకు వస్తాయి. చిత్తశుద్దితో పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు అధికారాన్ని కట్టబెడతారని అన్నారు. విజయవాడలో బోత్స మీడియా తో మాట్లాడారు.

English summary
ycp leader botsa satyanarayana criticize to cm chandrababu naidu, and he asks that, how the cm official reviews would be held when the election code was in force,then cm voilated election code, while election code was in force he released 18 confidencial GO'S
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X