వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జగన్, చంద్రబాబు- భావోద్వేగ ట్వీట్లు...

|
Google Oneindia TeluguNews

74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలకు ముందే ఇరువురు నేతలు భావోద్వేగంతో కూడిన ట్వీట్ల ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను కూడా అందులో పేర్కొన్నారు.

Recommended Video

AP CM Jagan, CM KCR, Pawan Kalyan's #IndependenceDay2020 Celebrations || Oneindia Telugu

74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ తమ నిబద్ధత, దేశభక్తితో మనం ఇవాళ ఇలా ఉండేందుకు కారణమైన ప్రతీ ఒక్కరికీ సెల్యూట్‌ అంటూ సీఎం వైఎస్‌ జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి శుభ సందర్భంలో వారు నెలకొల్పిన విలువలను కాపాడటంతో పాటు వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిజ్ఞ చేయాలంటూ జగన్ తన ట్వీట్‌లో కోరారు.

ap cm ys jagan and opposition leader chandrababu tweet wishes on independence day

విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ట్వీట్‌ ద్వారా పేర్కొన్నారు. బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని స్వేఛ్చను పొందిన రోజు ఇది. హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన శుభదినం. ఏ దేశంలోనూ లేని రీతిలో ప్రాధమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను మనకు అందించారు పెద్దలంటూ చంద్రబాబు తన ట్వట్‌లో పేర్కొన్నారు అలాగే పోరాడి సాధించుకున్న హక్కులనుఎక్కడ కాలరాసినా, వ్యవస్ధలను కూలదోసినా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా... వాటిని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి పై ఉంది. లేదంటే దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాలను వృధా పరచిన వాళ్ళం అవుతాం. దేశ ప్రజలందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ముగించారు.

ap cm ys jagan and opposition leader chandrababu tweet wishes on independence day

English summary
andhra pradesh chief minister ys jagan mohan reddy and opposition leader chandrababu naidu wishes the state people on the eve of independence day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X