హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాడేపల్లిలో జగన్: జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు: ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ.. !

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ ఉదయం 7 గంటల నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా ప్రజలు జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యులు అయ్యారు. తమను తాము స్వీయ గృహనిర్బంధంలో ఉండిపోయారు. రోడ్ల మీదికి రావడానికి ఎవరూ సాహసించట్లేదు.

యుద్ధం ఆరంభం: గాంధీగిరి తరహాలో: యూట్యూబ్ లైవ్ ద్వారా క్రైస్తవుల ప్రార్థనలు..!

తాడేపల్లి నివాసంలో వైఎస్ జగన్..

తాడేపల్లి నివాసంలో వైఎస్ జగన్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన అధికారిక నివాసానికే పరిమితం అయ్యారు. ఆదివారం కొన్ని కీలకమైన షెడ్యూల్స్, అపాయింట్‌మెంట్స్ ఉండగా.. వాటన్నింటినీ రద్దు చేశారు. సాధారణ రోజుల్లో ముఖ్యమంత్రి నివాసానికి మంత్రులు లేదా జిల్లాలకు చెందిన నాయకులు, పేషీ అధికారులు వస్తుంటారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలతో హడావుడిగా కనిపిస్తుంటుంది. ఈ ఉదయం అలాంటి వాతావరణమేదీ లేదు.

 కొద్దిమంది పేషీ అధికారులు.. వ్యక్తిగత సిబ్బందితో..

కొద్దిమంది పేషీ అధికారులు.. వ్యక్తిగత సిబ్బందితో..

ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, పేషీ ఉద్యోగులు, సహా కొందరు వ్యక్తిగత సిబ్బంది మాత్రమే తాడేపల్లి నివాసంలో కనిపించారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ముఖ్యమంత్రిని కలిసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై జగన్‌కు వారు రోజువారీ నివేదికను అందజేశారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన రెండు కరోనా పాజిటివ్ కేసుల గురించి జగన్‌కు వివరించినట్లు చెబుతున్నారు.

 హైదరాబాద్‌లో చంద్రబాబు, నారా లోకేష్

హైదరాబాద్‌లో చంద్రబాబు, నారా లోకేష్

జనతా కర్ఫ్యూను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ శనివారమే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. తమ కుటుంబ సభ్యులతో సహా వారు స్వీయ గృహనిర్బంధాన్ని పాటిస్తున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలను తీసుకోవాలని పిలుపునిస్తూ చంద్రబాబు శనివారం రాత్రి ఓ వీడియోను విడుదల చేశారు.

Recommended Video

Byreddy Shabari Warns YSRCP| Trolls On Social Media | Oneindia Telugu
పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్..

పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్..


ఈ సందర్భంగా చంద్రబాబు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం 11 గంటలకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్ రమణ సహా కొందరు సీనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారని సమాచారం. కరోనా వైరస్‌పై పోరాటాన్ని కొనసాగించడంలో పార్టీ శ్రేణులను సమాయాత్తం చేయాలని సూచిస్తారని చెబుతున్నారు.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy and Teugu Desam Party President Chandrababu were participated in Janata Curfew. YS Jagan monitoring the situation from his official residence at Tadepalli in Guntur district and Chandrababu Naidu self imposed curfew in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X