వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమయం లేదు మిత్రమా? అమరావతా? వైజాగా?

AP ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో రాష్ట్రంలో మరోసారి రాజధానుల రగడ రాజుకుంది.

|
Google Oneindia TeluguNews

AP ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో రాష్ట్రంలో మరోసారి రాజధానుల రగడ రాజుకుంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. దీనికి సన్నాహక సదస్సు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఏపీ పరిపాలనా రాజధాని విశాఖపట్నమేనని, త్వరలోనే తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు.

ఖండించిన బీజేపీ నేతలు

ఖండించిన బీజేపీ నేతలు


వైఎస్ జగన్ చేసిన ప్రకటనను బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు జగన్ ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రకటనపై స్పందించారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో 4వేల కోట్లరూపాయలు అప్పు ఇప్పించామని, అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ రహదారి నిర్మాణానికి కూడా పూనుకున్నామని, మూడు రాజధానులనేవి అభివృద్ధికి దోహదపడవన్నారు.

మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న వైసీపీ

మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న వైసీపీ

వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో మూడు రాజధానులకు మద్దతు పలుకుతోంది. అభివృద్ధిని వికేంద్రీకరించడంద్వారా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనేది ఆ పార్టీ సిద్ధాంతం. మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు మూడున్నర సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో పాదయాత్ర ప్రారంభించినప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో అకస్మాత్తుగా ఆపేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నడుస్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు.

ఎన్నికలకు ఏడాది సమయమే

ఎన్నికలకు ఏడాది సమయమే

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోను రాజధానిని తరలించాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ ప్రభుత్వం అందుకనుగుణంగా అడుగులు ముందుకు వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చినట్లవుతుందని, రానున్న ఎన్నికల్లో ఈ రెండు ప్రాంతాల్లో మెజారిటీ సీట్లను సాధించవచ్చనేది వైసీపీ వ్యూహకర్తల అంచనాగా ఉంది. విశాఖ రాజధానిగా కొనసాగుతుందా? అమరావతే ఏకైకా రాజధానిగా కొనసాగుతుందా? అనే విషయమై స్పష్టత రావాలంటే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాతే జరగనుంది.

English summary
With the announcement made by the AP Chief Minister YS Jaganmohan Reddy, the state has once again started the ruckus of capitalsAP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X