వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఉపాధ్యాయులకు ఊహించని వరం: ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ లుక్: ఇక 2 నెలలే

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్య, వైద్యం.. ఈ రెండింటినీ ప్రభుత్వం ద్వారానే ప్రజలకు అందాలనే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. నాడు-నేడు పేరుతో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలను ఇదివరకే చేపట్టారు. ఇక కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరంలో ఈ బదిలీల ప్రక్రియ ఆరంభం కాబోతోంది.

Recommended Video

AP CM Jagan On Nadu Nedu Education Review Meeting In Tadepalli

జగన్ సర్కార్‌పై రంగుల దాడి: సలహాదారులు ఏ కలుగులో దాక్కున్నారంటూ సెటైర్లుజగన్ సర్కార్‌పై రంగుల దాడి: సలహాదారులు ఏ కలుగులో దాక్కున్నారంటూ సెటైర్లు

నాడు-నేడుపై సమీక్ష సందర్భంగా

నాడు-నేడుపై సమీక్ష సందర్భంగా

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉద్దేశించిన నాడు-నేడు పథకంపై వైఎస్ జగన్ బుధవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పీవీ రమేష్, విజయ్‌కుమార్, స్పెషలాఫీసర్ కే వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు ఈ సమీక్షా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.

బదిలీలకు పచ్చజెండా

బదిలీలకు పచ్చజెండా

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తోన్న ఉపాధ్యాయుల బదిలీల విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దీనికి అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా బదిలీలను ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను నిర్వహించిన వెంటనే బదిలీలను చేపట్టాలని సూచించారు.

పారదర్శకంగా..

పారదర్శకంగా..


వేలాదిమంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలు, లక్షలాది మంది విద్యార్థులతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల ఎలాంటి గందరగోళానికి అవకాశం ఇవ్వకూడదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా అధికారులు ఆదేశించారు. ఈ అంశాన్ని సున్నితమైనదిగా భావించాలని, పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అక్రమాలకు అవకాశం ఇవ్వవద్దని అన్నారు. అవినీతి రహితంగా ఈ ప్రకియను ముగించాలని ఆదేశించారు. ఆగస్టు 3వ తేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభించబోతున్నందున ఈ లోగా దీన్ని పూర్తి చేయాలని చెప్పారు.

ఫర్నిచర్ పరిశీలన

ఫర్నిచర్ పరిశీలన

నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను ప్రభుత్వం మార్చబోతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మూత్రశాలలను నిర్మిస్తోంది. ఈ పనులు ప్రారంభం అయ్యాయి కూడా. ఇక తరగతి గదులకు సమకూర్చాల్సిన ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి. ప్రతి తరగతి గదిలోనూ బెంచీలను అందుబాటులోకి తీసుకుని రానుంది. ప్రతి పాఠశాలలోనూ రివర్స్ ఒస్మాసిస్ (ఆర్ఓ) ద్వారా శుద్ధి చేసిన మంచినీటి సౌకర్యాన్ని కల్పించనుంది. దానికి సంబంధించిన ఫర్నిచర్, పరికరాలను వైఎస్ జగన్ పరిశీలించారు.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy conducted review meeting on Nadu-Nedu Scheme at his Camp office in Thadepalli in Guntur district on Wednesday. He gave permission to transfer of Government School teachers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X