వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ చనిపోలేదు..ఇంకా జీవించే ఉన్నారు: డిక్లరేషన్ వివాదం వేళ: జగన్‌కు చిల్కూర్ అర్చకుడి అండ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ డిక్లరేషన్ వివాదాలు ముసురుకున్న వేళ..తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఆయనను అన్యమతస్తుడిగా చిత్రీకరిస్తోన్న సమయంలో.. చిల్కూర్ బాలాజీ ఆలయ అర్చకుడు గళం విప్పారు. వైఎస్ జగన్‌కు అండగా నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హిందూ ఆలయ వ్యవస్థను పరిరక్షించడానికి తీసుకున్న సంచలన నిర్ణయాల గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. మత రాజకీయాలకు పాల్పడుతోన్న వారికి ఇలా చెక్ పెట్టొచ్చని సూచించారు.

జగన్‌ పంతానికి తోడైన కొడాలి కామెంట్స్‌- ముదిరిన డిక్లరేషన్ వివాదం..విపక్షాలకు ఆయుధంగా జగన్‌ పంతానికి తోడైన కొడాలి కామెంట్స్‌- ముదిరిన డిక్లరేషన్ వివాదం..విపక్షాలకు ఆయుధంగా

టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్‌కు

టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్‌కు

ఆయనే డాక్టర్ ఎంవీ సౌందరరాజన్. విసాల వెంకన్నగా గుర్తింపు పొందిన చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు. ఉమ్మడి రాష్ట్రంలో హిందూ ఆలయాల పరిరక్షణ కోసం ఉద్యమాలను నడిపించారు. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ పేరుతో వాటిని కొనసాగించారు. దేవస్థానాలు, అర్చకుల సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు కావడానికి పరోక్షంగా సౌందరరాజన్ కారకులు అయ్యారు. దేవాదాయ శాఖలో అత్యున్నత విభాగపు హోదాను ధార్మిక పరిషత్‌‌కు ఇచ్చింది వైఎస్సార్ ప్రభుత్వం. దీనికోసం దేవాదాయ చట్టంలో సవరణలను సైతం చేపట్టారు.

డిక్లరేషన్ వివాదం వేళ..

డిక్లరేషన్ వివాదం వేళ..


సౌందరరాజన్ చాలాకాలం తరువాత తన గళాన్ని వినిపించారు. ఏపీలో డిక్లరేషన్ వివాదం నడుస్తోన్న వేళ.. ఆయన వైఎస్ జగన్‌కు అండగా నిలిచారు. మద్దతుగా మాట్లాడారు. అలాగే- ధార్మిక పరిషత్‌ను పునరుద్ధరించాలని విజ్ఙప్తి చేశారు. చిల్కూర్ బాలాజీ ఆలయం నిర్వహిస్తోన్న ధార్మిక హక్కుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ధార్మిక పరిషత్‌ను పునరుద్ధరించడం ద్వారా విమర్శలకు నోళ్లకు తాళం వేయొచ్చని సౌందరరాజన్.. వైఎస్ జగన్‌కు సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

వైఎస్సార్‌ను గుర్తు చేశారు..

తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సందర్భంగా.. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వచ్చారని సౌందరరాజన్ అన్నారు. తిరుమలలో వైఎస్సార్‌లాగా నడచుకున్నారని చెప్పారు. రాత్రంతా తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చోటుు చేసుకున్న ఆలయ పరిరక్షణ చర్యలను గుర్తుకు తెచ్చుకున్నానని అన్నారు. వైఎస్ తమ మధ్య లేరని తాను అనుకున్నానని, కానీ.. ఆయన ఆయన చనిపోలేదనే విషయం జగన్ ద్వారా రుజువైందని చెప్పారు. వైఎస్సార్ జీవించే ఉన్నారనే విషయాన్ని ప్రపంచంలో అందరూ చూశారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జగన్‌కు ప్రశంసలు అందాయని సౌందరరాజన్ పేర్కొన్నారు.

Recommended Video

#Watch AP CM YS Jagan's Lotus Pond ముట్టడి, Bajrang Dal Activists నిరసనలు....!! || Oneindia Telugu
 ధార్మిక పరిషత్‌ను పునరుద్ధరించండి..

ధార్మిక పరిషత్‌ను పునరుద్ధరించండి..

వైఎస్ జగన్ రెండురోజుల పాటు తిరుమలలో గడపడం తనకు సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. ధార్మిక హక్కుల కోసం చిల్కూర్ బాలాజీ ఆలయం చేస్తోన్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఙప్తి చేశారు. ధార్మిక హక్కుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు ఇస్తోందనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు. అలాగే.. ధార్మిక పరిషత్‌ను పునురుద్ధరించాలని కోరారు. ధార్మిక పరిషత్‌ను పునరుద్ధరించగలిగితే.. అందరి నోళ్లను మూసేయొచ్చని సౌందరరాజన.. వైఎస్ జగన్‌కు సూచించారు. వీలైనంత త్వరగా ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు.

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy gets support from Chilkur Balaji temple Chief Priest Dr MV Soundararajan on offering silk clothes to Lord Sri Venkateswara Swamy on the occassion of Salakatla Brahmotsavam at Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X