• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ అనూహ్యం: బీజేపీని తిడుతూనే బిల్లులకు మద్దతు, విశ్వాసం కోసమే -కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనార్టీలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వక్ఫ్ బోర్డుల పరిధుల్లోని ఆస్తుల రక్షణకు, ముస్లింలకు కొత్త స్మశానాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. వక్ఫ్ ట్రిబ్యూనల్ ఏర్పాటుపైనా సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. మరోవైపు, ఏపీలో బీజేపీతో గొడవపడుతూ, జగన్ సర్కారును కూల్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోన్న వైసీపీ అటు పార్లమెంటులో మాత్రం ఇదే బీజేపీ రూపొందించిన కీలక బిల్లులకు మరోసారి మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. వివరాలివి..

bigg boss గుట్టు రట్టు దిశగా సీబీఐ -సీఎం జగన్ పై వైసీపీలో ఆందోళన -సాయిరెడ్డికి దిమ్మతిరిగేలా RRR కౌంటర్bigg boss గుట్టు రట్టు దిశగా సీబీఐ -సీఎం జగన్ పై వైసీపీలో ఆందోళన -సాయిరెడ్డికి దిమ్మతిరిగేలా RRR కౌంటర్

వక్ఫ్ భూముల చుట్టూ రక్షణ..

వక్ఫ్ భూముల చుట్టూ రక్షణ..

ఏపీలోని వక్ఫ్‌ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వక్ఫ్‌ భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు. మైనారిటీ సంక్షేమశాఖపై సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ ఆఫీసులో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాను జారీ చేశారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా.. భూముల చట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. అంతేకాదు,

జగన్ బెయిల్ రద్దు: సీఎంగా సజ్జల -వైఎస్ భారతి సిమెంట్, చంద్రబాబు మజ్జిగలా : ఎంపీ రఘురామ సంచలనంజగన్ బెయిల్ రద్దు: సీఎంగా సజ్జల -వైఎస్ భారతి సిమెంట్, చంద్రబాబు మజ్జిగలా : ఎంపీ రఘురామ సంచలనం

కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యూనల్..

కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యూనల్..

వక్ఫ్ భూముల చుట్టూ ప్రహారీలు నిర్మించాలని ఆదేశించిన సీఎం జగన్, అసలు రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుల పరిధిలోని భూముల వివరాలన్నిటినీ సేకరించాలని అధికారులకు చెప్పారు. వైఎస్సార్‌ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు.. వక్ఫ్ ఆస్తులను కూడా సర్వే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే, న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులోనే వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కర్నూలులోనే ఉర్దూ వర్శిటీ పనులను నాడు -నేడు తరహాలో చేపట్టాలని, ఉర్దూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సీఎం అధికారుకు సూచించారు. మైనార్టీ శాఖపై సీఎం సమీక్షలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక,

మైనార్టీలకూ సబ్‌ ప్లాన్.. స్మశానాలు

మైనార్టీలకూ సబ్‌ ప్లాన్.. స్మశానాలు


ఏపీలో మైనార్టీలకు కొత్త శ్మశానవాటికల ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని వాటి నిర్మాణాలు చేపట్టాలని, ఇమామ్‌లు, మౌజమ్‌, పాస్లర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లించాలని తెలిపారు. మైనార్టీలకూ సబ్‌ ప్లాన్ కోసం సంబంధించిన చర్యలు తీసుకోవాలని, మైనార్టీశాఖలో పెండింగ్ సమస్యలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ సేవలు వినియోగించుకోవాలని సీఎం చెప్పారు. మరోవైపు,

విజయవాడ - గుంటూరు మధ్య హజ్‌ హౌస్

విజయవాడ - గుంటూరు మధ్య హజ్‌ హౌస్


ఉర్దూ అకాడమీ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధి చేయాలని, షాదీఖానాల నిర్వహణను మైనార్టీశాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మైనార్టీశాఖలో ఖాళీ పోస్టుల నియామకాలను.. ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. విజయవాడ - గుంటూరు పరిసరాల్లో హజ్‌ హౌస్ నిర్మాణానికి సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. హజ్‌ కమిటీలు, వక్ఫ్‌ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని, గుంటూరు జిల్లా గత ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్‌ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్‌ అధికారును ఆదేశించారు. ఇదిలా ఉంటే,

బీజేపీని తిడుతూనే బిల్లులకు మద్దతు

బీజేపీని తిడుతూనే బిల్లులకు మద్దతు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, భారీగా అప్పులు అంశంలో కేంద్రం దర్యాప్తు చేయించబోతున్నదనే అంశం చుట్టూ వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటం, జగన్ సర్కారును కూల్చేసి, ఏపీలో బాబాల పాలన తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తుండటం, జగన్ ను తాము జైలుకు పపడం కాదు, ఇప్పటికే చేసిన నేరాలతో వైసీపీ తన గొయ్యి తానే తొవ్వుకుందని బీజేపీ కౌంటరివ్వడం తెలిసిందే. ఏపీలో బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరగా, మోదీపై జగన్ తిరుగుబావుటా ఎగరేశారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ ఇక్కడి సీన్ కు పూర్తి భిన్నంగా పార్లమెంటులో వైసీపీ వ్యవహరిస్తుండటం గమనార్హం. ఎన్డీఏ మిత్రులు సైతం వెనుకడుగు వేస్తోన్న తరుణంలో జగన్ నాయకత్వంలోని వైసీపీ.. బీజేపీ ప్రతిపాదించిన బిల్లులకు బేషరతుగా మద్దతు ఇవ్వడం గమనార్హం.

విశ్వాసం పెరుగుతుందనే వైసీపీ మద్దతు

విశ్వాసం పెరుగుతుందనే వైసీపీ మద్దతు

మోదీ సర్కారు రూపొందించిన టాక్సేషన్‌ చట్టాల (సవరణ) బిల్లుపై సోమ‌వారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. రెట్రాస్పెక్టివ్‌ టాక్స్‌ తొలగింపు మంచి పరిణామమ‌ని, ఈ బిల్లు ద్వారా వెనుకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలన్న నిబంధన తొలగిపోతుందని, తద్వారా అంతర్జాతీయ లిటిగేషన్లకు ఆస్కారం ఉండదని ఆయన చెప్పారు. భారత్ పై విదేశీ కంపెనీల విశ్వాసం పెరగడంతోపాటు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మరింత సులభతరం అవుతుంది కాబట్టే టాక్సేషన్‌ చట్టాల (సవరణ) బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని సాయిరెడ్డి ప్రకటించారు. మరోవైపు, పోలవరంపై లోక్‌సభలో వైసీపీ వాయిదా తీర్మానం చేసింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని నోటీస్‌ ఇచ్చింది. అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధ ఈ మేరకు లోక్‌సభలో వాయిదా తీర్మానం అందజేశారు.

English summary
andhra pradesh chief minister ys jagan mohan reddy took key decision regarding muslim minorities. in a review meeting on minority department on monday. cm jagan has ordered officials to create waqf board tribunal in kurnool and haj house in vijayawada or guntur. despite tussle with bjp, jagan led ysrcp supports several bills in parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X