• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీ నుంచి ఏపీకి: ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ టూర్, పీయూష్ గోయల్, ప్రధాన్‌తో కీలక భేటీ

|

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజులపాటు వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అనంతరం శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి ఏపీకి బయల్దేరారు. కేంద్ర మంత్రలు అమిత్ షా, పీయూష్ గోయల్, షెకావత్, ప్రకాశ్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌లను ఈ రెండ్రోజుల్లో కలిసిన జగన్.. ఏపీకి సంబంధించిన కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి తమవంతు సహకరిస్తామని కేంద్రమంత్రులు ఏపీ సీఎంకు హామీ ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ఉన్నారు.

వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ తొలి రోజు వరుస భేటీలు..

వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ తొలి రోజు వరుస భేటీలు..


రెండో రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి రాత్రి 9 గంటల నుంచి గంటన్నరపాటు సమావేశమయ్యారు. తొలిరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు అమిత్ షా, గజేంద్ర షెకావత్, ప్రకాశ్ జవదేకర్, తదితరులతో భేటీ అయ్యారు. మూడు రాజధానులతోపాటు పోలవరం నిధులు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతోపాటు రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.

ధర్మేంద్ర ప్రధాన్‌తో విశాఖ ప్రైవేటీకరణపై..

ధర్మేంద్ర ప్రధాన్‌తో విశాఖ ప్రైవేటీకరణపై..

పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు పెట్రోలియం శాఖ మంత్రి ప్రధాన్‌తో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై కేంద్రమంత్రితో జగన్ చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని, ఆ విషయంలో తాము సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి కేంద్రమంత్రికి వివరించారు. కాకినాడ ఎస్ఈజడ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు. వయాబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారం లేకుండా చూడాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఏపీలో ఖచ్చితంగా పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపిన ధర్మేంద్ర ప్రధాన్.. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ సానుకూలంగా స్పందించారు. వచ్చేవారం ఏపీ సీఎస్, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో భేటీ ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. దాదాపు గంటకుపైగా ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం సమావేశమయ్యారు.

బకాయిలు చెల్లించాలని.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో

బకాయిలు చెల్లించాలని.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో

కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తోనూ శుక్రవారం సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ స్లపైకి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. 2020-21 రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పిన సీఎం జగన్.. సకాలంలో రైతులకు చెల్లింపులు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని, బకాయిలు విడుదల అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.కాగా, 2015 డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌కార్డుదారులకు ప్రతినెల బియ్యం కేటాయిస్తున్నారని, 2015 డిసెంబర్ తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96% కుటుంబాలకు, పట్టణాల్లో 41.14% కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసి బియ్యం ఇచ్చేలా సూత్రాన్ని అమలు చేస్తున్నారని పీయూష్‌ గోయల్‌కు తెలియజేశారు. దీని కారణంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎం జగన్‌ కేంద్రమంత్రికి వివరించారు.

English summary
AP CM YS Jagan meets union ministers Piyush Goyal and Dharmendra Pradhan: delhi tour over and returned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X