వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్తఫా డెడ్‌లైన్‌కు తలొగ్గిన జగన్.. ఎన్‌పీఆర్‌పై కీలక ప్రకటన.. మోదీతో ఢీ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ముస్లిలను కలవరపెడుతోన్నపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)కు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా విధించిన డెడ్‌లైన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలొగ్గారు. ఇప్పటికే సీఏఏ, ఎన్ఆర్‌సీలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్.. తాజాగా ఎన్‌పీఆర్ ను కూడా ఏపీలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన అత్యంత వ్యూహాత్మకంగా మంగళవారం ఒక ప్రకటన చేశారు.

కొత్త రూల్స్‌పై కలవరం

కొత్త రూల్స్‌పై కలవరం

దేశంలోని ప్రతి పౌరుడి డేటాబేస్‌ను సమగ్రంగా గుర్తించేందుకు వీలుగా అప్పటి మన్మోహన్ సింగ్ సర్కారు.. 2011 జనాభా లెక్కలు(సెన్సెస్) కోసం 2010లో తొలిసారి జాతీయ జనాభా పట్టిక లేదా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్)ను రూపొందించింది. ఆ జాబితాను పదేళ్లకు ఒకసారి సవరించాల్సి ఉన్నందున.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్‌పీఆర్ ప్రక్రియ చేపట్టి.. 2021 జనాభాలెక్కలతో అప్ డేట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే 2010 ఎన్‌పీఆర్‌లో లేని కొన్ని నిబంధనల్ని.. 2020 ఎన్‌పీఆర్‌ లో చేర్చారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ ఫలితాలు చూశాక, దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీపై ప్రజల్లో తీవ్రభయాందోళనలకు రేకెత్తడం.. అదే సమయంలో కేంద్రం ఎన్‌పీఆర్‌ నిబంధనల్ని మార్చడం వివాదాస్పదమైంది. సరిగ్గా ఇదే అంశాన్ని జగన్ లేవనెత్తారు..

సీఎం ఏం చెప్పారంటే..

సీఎం ఏం చెప్పారంటే..

తాజా నిబంధనల్ని అనుసరించి ఏపీలో ఎన్‌పీఆర్ అమలు చేయలేమని సీఎం జగన్ స్పష్టం చేశారు. కొత్త రూల్స్ ను పూర్తిగా తొలగిస్తే తప్ప ప్రక్రియపై ముందుకు వెళ్లబోమన్నారు. ‘‘ఎన్‌పీఆర్ కు సంబంధించిన తాజా ప్రతిపాదనలపై మా(ఏపీ) రాష్ట్రానికి చెందిన మైనార్టీలు అభద్రతాభావంలో ఉన్నారు. ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పార్టీ పరంగా విసృతమైన చర్చలు, సంప్రదింపుల్లో ఈ విషయం తేటతెల్లమైంది. కాబట్టి కొత్త రూల్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, 2010 నాటి నిబంధనల్ని యధావిధిగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం''అని సీఎం జగన్ ప్రకనట చేశారు.

అసెంబ్లీలో తీర్మాం..

అసెంబ్లీలో తీర్మాం..

ఎన్‌పీఆర్ కు సంబంధించి పాత(2010 నాటి) నిబంధనల్ని మళ్లీ పునరుద్ధరించేలా కేంద్రాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఒకవేళ పాత రూల్స్ ప్రకారమే ఎన్‌పీఆర్ చేపడితే తప్పకుండా సహకరిస్తామనే అర్థంలో కేంద్రానికి సిగ్నల్స్ పంపారు. మండలి రద్దు బిల్లు పార్లమెంటులో పెండింగ్ లో ఉండటం, బీజేపీ-వైసీపీ దోస్తీపై పెద్ద ఎత్తున ఊహాగానాలు ప్రచారమవుతోన్న నేపథ్యంలో.. మోదీ విధానాలకు వ్యతిరేకంగా జగన్ వినతి చేయడం రాజకీయంగా ప్రధాన్యం సంతరించుకుంది.

ముస్తఫా హ్యాపీ..

ముస్తఫా హ్యాపీ..


సీఏఏ, ఎన్ ఆర్సీ, ఎన్‌పీఆర్ కు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానాలు పెట్టకపోతే తాను వైసీపీకి రాజీనామా చేస్తానంటూ గుంటూరు(తూర్పు) ఎమ్మెల్యే ముస్తఫా ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏదోఒక ప్రకటన చేయాలని కూడా పార్టీకి ఆయన డెడ్ లైన్ విధించారు. సరిగ్గా రోజు గడిచేలోపే ముస్తఫా డెడ్ లైన్ కు సీఎం జగన్ తలొగ్గారు. మంగళవారం ఎమ్మెల్యే ముస్తఫాతోపాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, మతపెద్దలు సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ ను కలసుకున్నారు. వాళ్లతో భేటీ ముగిసిన వెంటనే సీఎం వ్యూహాత్మకంగా ట్విటర్ ద్వారా ప్రకటన చేశారు. దీంతో ముస్తఫాతోపాటు అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. ఎన్‌పీఆర్‌పై ఏపీ సీఎం ప్రకటనపై కేంద్రం స్పందించాల్సిఉంది.

English summary
andhrapradesh chief minister clarifies that no npr will be taken up in the state until center would revert the conditions to those prevailing in 2010
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X