• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ జగన్ లేఖ: రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఆయన కోరారు. తక్షణమే రూ. 2250 కోట్లు సాయం చేయడంతోపాటు వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: అత్యధిక కేసులు, మరణాలు ఏ జిల్లాలోనంటే..?

భారీ వర్షాలతో తీవ్ర నష్టం..

భారీ వర్షాలతో తీవ్ర నష్టం..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా నవంబర్ 9 నుంచి 13 వరకు కురిసిన భారీ వర్షాలకు రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. తొమ్మిది జిల్లాల్లోని 71,800 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు లేఖలో వెల్లడించారు. వరి, మొక్కజొన్న, పత్తితోపాటు అరటి, బొప్పాయి, పలు కూరగాయ పంటలు కూడా నీటమునిగాయని పేర్కొన్నారు.

పదుల సంఖ్యలో మరణించారు..

పదుల సంఖ్యలో మరణించారు..

భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరదలు రావడంతో వేర్వేరు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిందన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ సిబ్బంది నిర్విరామంగా పనిచేశారు. అయినా, 14 మంది మృతి చెందినట్లు తెలిపారు.

మోడీ ఆరా తీసిన నేపథ్యంలో..

మోడీ ఆరా తీసిన నేపథ్యంలో..

కాగా, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అక్టోబర్ 14న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసిన విషయం తెలిసిందే. వరద పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి జగన్ లేఖ రాయడం గమనార్హం. ఇది ఇలావుంటే, ఇప్పటికే కేసీఆర్ భారీ వర్షాలు, వరదలు కారణంగా భారీ నష్టం జరిగిందని.. రూ. 5వేల కోట్ల సాయం కావాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు.

  Modi Jagan Meet: జగన్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ .. 17 అంశాలపై ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి నివేదన!!
  భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

  భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

  గత వారం పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. పలుచోట్ల ఇళ్లు కూలి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలతో నగరంలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. నగర ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు చేరుకోవడం రాకపోకలు స్తంభించిపోయాయి. రహదారిపై కొన్ని కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.

  English summary
  ap cm ys jagan wrote a letter to HM amit shah on heavy rains and floods affect.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X