• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మరో వివాదంలో ప్రవీణ్ ప్రకాశ్ : ఆయన రూటే సపరేటు : ప్రభుత్వ సొమ్ముతో ప్రయివేటు టూర్లు..!!

By Chaitanya
|

ఏపీలో కీలక స్థానంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పని చేసారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఏపీకి తిరిగి వచ్చారు. జీఏడి ముఖ్య కార్యదర్శిగా..సీఎం ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు అప్పట్లోనే వివాదాస్పదం అయినట్లుగా ప్రచారం సాగింది. ఇక, ఆయన్ను జీఏడిలో కాకుండా సీఎం ముఖ్య కార్యదర్శిగా కొనసాగిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వంలో కీలకంగా

ఏపీ ప్రభుత్వంలో కీలకంగా

తాజాగా జరుగతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారంటూ అధికార వర్గాల్లో చర్చ సాగింది. అయితే, గతంలో ఏపీలో పని చేసిన సమయంలోనూ ప్రవీణ్ ప్రకాశ్ ముక్కుసూటి తనం అనేక వివాదాలను క్రియేట్ చేసిందని చెబుతారు. ఇక, ఇప్పుడు తాజాగా ప్రవీణ్ ప్రకాశ్ ప్రతీ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రవీణ్ ప్రకాశ్ సతీమణి భావనా సక్సేనా ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఢిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. శని-ఆది వారాలు సెలవు కావటంతో ఆయన ఢిల్లీకి వెళ్లటం పైన ఎటువంటి అభ్యంతరాలు లేవు.

ప్రతీ వారం అమరావతి టు ఢిల్లీ

ప్రతీ వారం అమరావతి టు ఢిల్లీ

అయితే, ఆయన ఢిల్లీకి ప్రతీ వారం రాకపోకలు సాగించటానికి ప్రత్యేకంగా ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుందంటూ కధనాలు వస్తున్నాయి. ఇందు కోసం ఆయన ప్రతీ వారం ఢిల్లీ పర్యటన అధికారికంగా చూపిస్తూ ఈ చెల్లింపులు జరుగుతన్నాయనేది ఆ కధనాల సారాంశం. ప్రతీ వారం అధికారిక పర్యటన ఏముంటుంది..రాష్ట్రంలో ఉన్న ఆర్దిక సంక్షోభంలో ఇలాంటి ఖర్చులు ఏంటనే చర్చ మొదలైంది. ఇతర అధికారుల మాదిరిగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఎకానమీ క్లాసులో వెళ్లరు. బిజినెస్‌ క్లాస్‌ కావాల్సిందేనంటూ కధనాల్లో పేర్కొంటున్నారు.

ప్రభుత్వ అధికారిక పర్యటల్లో భాగంగా

ప్రభుత్వ అధికారిక పర్యటల్లో భాగంగా

ప్రవీణ్ ప్రకాశ్ ప్రతీ వారాంతంలో అధికారిక హోదాలోనే ఢిల్లీ రాకపోకలు సాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనే విషయాన్ని సాధారణ పరిపాలన శాఖ ధ్రువీకరించిందని.. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. శనివారం, ఆదివారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా పని చేయవు. మరి ఆ రెండు రోజులు ఢిల్లీలో ఏం చేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. కేంద్రంలో వివిధ శాఖల కార్యదర్శులు, కిందిస్థాయి అధికారులను కలిసే అవకాశం ఉంది.

ఆర్దిక కష్టాల్లో రాష్ట్రం ఉంటే..ఇలా

ఆర్దిక కష్టాల్లో రాష్ట్రం ఉంటే..ఇలా

కానీ... వీకెండ్‌లో ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఏపీ నుంచి వస్తున్నారని వారు సెలవు రోజుల్లో పనిచేస్తారా అంటే అదీ సందేహమే. అప్పుడప్పుడు ప్రవీణ్‌ ప్రకాశ్‌ కొందరు ఢిల్లీ అధికారులను కలవడం నిజమేనని సహచర అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో అధికార వర్గాల నుంచి మరో వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ఫైళ్లపై కేంద్ర అధికారులను కలిసి ఫాలోఅప్‌ చేయడానికి ఇక్కడి నుంచి ఎవరూ వెళ్లక్కర్లేదని... అది ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్ల బాధ్యత గా చెబుతున్నారు.

  AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu
  ఇప్పుడైనా అడ్డుకట్ట వేస్తారా

  ఇప్పుడైనా అడ్డుకట్ట వేస్తారా

  ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి అదనపు నిధులు, అదనపు అప్పులకు అనుమతులు రాబట్టేందుకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్‌ తరచూ ఢిల్లీ వెళుతున్నారు. ఇలా అధికారిక పర్యటనకు వెళితే మాత్రం ప్రభుత్వం ఖర్చులు భరించవచ్చు. మరి... ప్రవీణ్‌ ప్రకాశ్‌ వారం వారం ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో అంటూ చర్చ సాగుతోంది.

  English summary
  Praveen Prakash the secretary in CMO had landed in another controversy as he used Govt money for his personal tours.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X