వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎఫెక్ట్: ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా

|
Google Oneindia TeluguNews

Recommended Video

పరకాల ప్రభాకర్ పదవికి రాజీనామా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆ లేఖలో కోరారు.

జగన్ వ్యాఖ్యలతో మనస్తాపం

జగన్ వ్యాఖ్యలతో మనస్తాపం

తాను ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పరకాల ప్రభాకర్ తన లేఖలో పేర్కొన్నారు.

నా వల్ల ప్రభుత్వానికి నష్టం జరగకూడదు

నా వల్ల ప్రభుత్వానికి నష్టం జరగకూడదు

కేంద్రంపై జరుగుతున్న ధర్మపోరాటంపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నారని పరకాల మండిపడ్డారు. తన వల్ల ప్రభుత్వానికి నష్టం జరగకూడదనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలు తన కుటుంబంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

జగన్, బొత్స విమర్ళు

జగన్, బొత్స విమర్ళు


ఇటీవల వైయస్ జగన్, బొత్స సత్యనారాయణలు మాట్లాడుతూ.. భార్య నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ఉంటారని, భర్త ప్రభాకర్ మాత్రం చంద్రబాబు పక్కన ఉంటారని, ఇదేం రాజకీయమని విమర్శించారు.

 చంద్రబాబు ఆమోదిస్తారా?

చంద్రబాబు ఆమోదిస్తారా?

ఇది ఇలా ఉంటే, గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో ప్రభుత్వ కార్యక్రమాలకు పరకాల దూరంగా ఉంటున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, జగన్ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వానికి తన కారణంగా నష్టం జరగకూడదనే తాను రాజీనామా చేస్తున్నట్లు పరకాల తన లేఖలో వెల్లడించారు. అయితే, పరకాల రాజీనామాను చంద్రబాబు ఆమోదిస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది.

English summary
Andhra Pradesh Communications Advisor Parakala Prabhakar resigned for his post on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X