వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరా ముందే ఊహించింది, ఎన్టీఆర్‌ కారును తిరుపతిలోకి రానివ్వలేదు: మురళీమోహన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్టీఆర్ పార్టీని ప్రకటించి ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతికి వచ్చిన సమయంలో ఇందిరాగాంధీ సభ ఏర్పాటుచేశారు. ఇందిరాగాంధీ సభ పూర్తయ్యేవరకు ఎన్టీఆర్ కారును కూడ తిరుపతి పట్టణంలోకి అడుగుపెట్టనివ్వలేదు.ఎన్టీఆర్ చైతన్య రథం నుండి వచ్చిన పాట విని జనం అటువైపు వెళ్ళడాన్ని చూసిన ఇందిరాగాంధీ గమనించి ఆనాడే అనుమానాలను వ్యక్తం చేసిందని సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళి మోహన్ గుర్తు చేసుకొన్నారు.

ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లో ప్రవేశంతో పాటు, ఎన్టీఆర్ ప్రచారం తదితర అంశాల గురించి మురళి మోహన్ ప్రస్తావించారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ప్రచారం చేస్తున్న సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను మురళీమోహన్ ప్రస్తావించారు.

ఎన్నికల సమయంలో తాము ప్రచారం చేస్తామని ఎన్టీఆర్‌ను కోరితే ఆయన సున్నితంగా తిరస్కరించారని మురళిమోహన్ గుర్తు చేసుకొన్నారు. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు తర్వాత ఆయన ప్రచారానికి జనం తండోపతండాలుగా హజరయ్యారని మురళీమోహన్ గుర్తు చేశారు.

ఎన్టీఆర్ పార్టీ ప్రభంజనాన్ని ఇందిరాగాంధీ ముందే గుర్తించారు.

ఎన్టీఆర్ పార్టీ ప్రభంజనాన్ని ఇందిరాగాంధీ ముందే గుర్తించారు.

ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేసి తిరుపతిలో సభ నిర్వహణ తేదిని ప్రకటించారు. అయితే అదే రోజున తిరుపతిలో ఇందిరాగాంధీ సభను కూడ ఏర్పాటు చేశారు అయితే ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన సభకు పక్కనే ఎన్టీఆర్ సభను కూడ ఏర్పాటు చేశారు. అయితే ఇందిరాగాంధీ సభ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ కారును తిరుపతి పట్టణంలోకి అనుమతివ్వలేదు. కానీ, ఇందిరాగాంధీ సభ పూర్తయ్యే చివరి నిమిషంలో ఎన్టీఆర్ కారును తిరుపతి పట్టణంలోకి అనుమతించారని రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ గుర్తు చేసుకొన్నారు. ఎన్టీఆర్ చైతన్య రథంపై చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అనే పాటతో తిరుపతిలోకి ప్రవేశించగానే జనం ఎన్టీఆర్ సభ వైపుకు వెళ్ళారని మురళీ మోహన్ గుర్తు చేశారు. ఏం జరుగుతోందని ఇందిరా గాంధీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతలను ఆరా తీశారని ఆయన ప్రస్తావించారు.సినీ యాక్టర్ పార్టీ పెట్టి ప్రచారం నిర్వహిస్తున్న విషయాన్ని ఇందిరాగంధీకి స్థానిక నేతలు చెప్పారు. అయితే జనంలో స్పందన చూసిన ఇందిరాగాంధీ సమ్‌థింగ్ రాంగ్ అన్నారని మురళీమోహన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఏపీ కాంగ్రెస్ నేతలు ఎన్టీఆర్‌ను తక్కువ అంచనా వేశారు

ఏపీ కాంగ్రెస్ నేతలు ఎన్టీఆర్‌ను తక్కువ అంచనా వేశారు

ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేయడం ప్రచారం చేయడం లాంటి పరిణామాలపై ఏపీకి చెందిన అప్పటి కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయాన్ని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ను తక్కువ అంచనా వేశారని మురళిమోహన్ అభిప్రాయపడ్డారు. కానీ, తిరుపతి సభతో ఎన్టీఆర్ ప్రభంజనంపై ఇందిరాగాంధీ ఒక అంచనాకు వచ్చారని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం పర్యటించకముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందన్నారు.

ఎన్నికల ప్రకటన వచ్చాక తెలంగాణలో ఎన్టీఆర్ ప్రచారం చేయనేలేదు

ఎన్నికల ప్రకటన వచ్చాక తెలంగాణలో ఎన్టీఆర్ ప్రచారం చేయనేలేదు

ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి ఎన్టీఆర్ తెలంగాణ ప్రాంతంలో ప్రచారం ఇంకా ప్రారంభించలేదని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గుర్తు చేసుకొన్నారు.తిరుపతి సభ పూర్తైన మూడు మాసాలకే ఎన్నికల ప్రకటన విడుదలైందని ఆయన గుర్తు చేసుకొన్నారు. అయితే ఆ సమయంలో తనతో పాటు కొందరు సినీ నటులు ఎన్టీఆర్ వద్దకు వెళ్ళి తాము కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావిస్తే ఎన్టీఆర్ వద్దని వారించారని మురళీమోహన్ గుర్తు చేసుకొన్నారు. మంచైనా, చెడైనా తాను భరించేందుకు సిద్దంగా ఉన్నట్టు ఎన్టీఆర్ చెప్పారు. మంచి భవిష్యత్తు ఉందని తమను ఒప్పించారని ఆయన చెప్పారు.

 ఆపరేషన్ తర్వాత ఇండియాకు తిరిగొస్తూ

ఆపరేషన్ తర్వాత ఇండియాకు తిరిగొస్తూ

ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గుర్తు చేసుకొన్నారు.ఏడాది తర్వాత ఎన్టీఆర్‌ గుండె ఆపరేషన్‌ కోసం అమెరికాకు వెళ్ళి తిరిగి వచ్చారని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ కోసం రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ వర్గాలు, అధికారులు, సామాన్య జనం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూశారని ఆయన గుర్తు చేసుకొన్నారు. విమానాశ్రయంలో సినీ ప్రముఖులను రెండు నిమిషాలు కలుసుకొని సాయంత్రం ఇంటికి రావాలని ఆహ్వనించారు. వెంటనే రాజకీయ నేతలతో ముచ్చటించారని మురళీ మోహన్ చెప్పారు.

English summary
Rajahmundry MP Murali Mohan opined that AP Congress leaders did not care much about setting up NTR TDP in 1982 March 29.A telugu daily news paper reporter interviewed him recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X