• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రక్షాళన షురూ.!ఏపీ కాంగ్రెస్ కు రేవంత్ లాంటి నేత కావాలి.!అణ్వేషనలో రాహుల్ గాంధీ.!

|

ఢిల్లీ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపైతంపై ఏఐసీసీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పీసిసి అధ్యక్షులను మార్చి రాష్ట్రాల వారీగా పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు ఏఐసీసీ మాజీ ఛైర్మన్ రాహుల్ గాంధీ. తాజాగా ఏపీ రాజకీయాలపై రాహుల్ గాంధీ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకునికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పాలని రాహుల్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తత ఏపీసిసి ఛీఫ్ శైలజా నాథ్ ను తప్పించి మరో అభ్యర్థికి పార్టీ అద్యక్ష బాద్యతలు కట్టబెట్టి స్తబ్దుగా ఉన్న పార్టీలో ఉత్సాహాన్ని నింపాలని రాహుల్ కృతనిశ్చయంతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలనుండి సమాచారం అందుతోంది.

 సమూల మార్పులు.. ఏపి కాంగ్రెస్ ప్రక్షాళనకు నడుం బిగించిన రాహుల్ గాంధీ..

సమూల మార్పులు.. ఏపి కాంగ్రెస్ ప్రక్షాళనకు నడుం బిగించిన రాహుల్ గాంధీ..

ఏపిలో కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో కూరుకుపోయింది. పార్టీని నడిపించే నాథుడులేక బలహీనపడిపోయింది. 2014లో రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా ఏపి ప్రజల ఆగ్రహ జ్వాలలకు బలైన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ కోలకోలేదు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గా బాద్యతలు నిర్వహించిన సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ప్రజలనుండి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. పార్టీని బ్రతికించడం ఇప్పట్లో సాద్యపడదని భావించి రఘువీరా అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పేసారు. కీలక సమయంలో పార్టీ అధిష్టానానికి లేఖ రాసి రాజకీయాల నుండి తప్పుకున్నారు.

 విభజన నిర్ణయంతో పూర్తి నష్టం.. కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టిన ఏపి ప్రజలు..

విభజన నిర్ణయంతో పూర్తి నష్టం.. కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టిన ఏపి ప్రజలు..

రఘువీరా బాద్యతలనుంచి తప్పుకున్న చాలా కాలం తర్వాత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను ఏపి కాంగ్రెస్ ఛీఫ్ గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాల్లో ఎలాంటి మార్పు లేదని అనేక కారణాల వల్ల జరిగిన ఎన్నికల్లో ఓటు ద్వారా నిరూపించారు ఏపీ ప్రజలు. సాధారణ ఎన్నిక, ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలనే భేదం లేకుండా కాంగ్రెస్ పార్టీని ఏపి ప్రజలు మట్టి కరిపిస్తూనే ఉన్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ మనుగడ అత్యంత ప్రశ్నార్ధకంగా మారింది. ఇలాంటి తరుణంలో ఏపీ కాంగ్రెస్ పునరుజ్జీవనం పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

 స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్.. నేతల్లో ఫుల్ గా నైరాశ్యం..

స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్.. నేతల్లో ఫుల్ గా నైరాశ్యం..

కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఏడేళ్లు కావస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో పీసిసి అద్యక్షులను మార్చివేయడంతో కొత్త ఆశలు చిగురిస్తున్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా బీజేపి ఏడేళ్ల పాలనలో చేసిన వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఏడేళ్ల సమయంలో ప్రజల ఆలోచనా దోరణిలో కూడా మార్పు చోటుచేసుకుంటుందని, జనరేషన్ లో మార్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పరిణామాలను ఒడిసిపట్టుకుని ప్రయోజనం పొందాలని రాహుల్ గాంధీ దిశానిర్ధేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఏపీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది.

  APCC New President Sake Sailajanath, N Tualsi Reddy and Shaikh Mastan Vali Are Working Presidents
   కొత్త నాయకత్వం.. పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలంటున్న రాహుల్..

  కొత్త నాయకత్వం.. పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలంటున్న రాహుల్..

  ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గా ఉన్న శైలజా నాథ్ ను తప్పించి పార్టీలో జవసత్తువలు, నూతన ఉత్సాహాన్ని నింపే నాయకుడి కోసం రాహుల్ గాంధీ అణ్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. నిస్తేజంగా ఉన్న పార్టీలో ఉత్సాహాన్ని నిపింన రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఏపీ కి అవసరమని రాహుల్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని కలిగించి పూర్వవైభవం దిశగా అడుగులు వేయించే సమర్ధత ఉన్న నేతకోసం రాహుల్ గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా విభజన సమయంలో కీలకంగా వ్యవహరించిన మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుకు ఏపి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలనే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్టు తెలుస్తోంది.

  English summary
  Rahul Gandhi seems to be focused on AP politics. Rahul is reportedly planning to hand over the reins of the AP Congress to a young leader like Revant Reddy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X