వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలా అయితే.... ఏ అధికారి ఉండరు, సీఎస్ బదిలీ సరైంది కాదన్న ఎంపీ సుజనా చౌదరి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుభ్రహ్మాణ్యంను అకస్మాత్తుగా బదిలీ చేయడాన్ని ఎంపీ సుజనా చౌదరీ తప్పుబట్టారు. ఉన్నతాధికారులను ఇలా బదిలీ చేయడం వల్ల ఇతర అధికారుల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని అన్నారు. ఎల్వీ సుభ్రహ్మణ్యం లాంటీ సీనియర్ ఆధికారికే ఇలాంటీ పరిస్థితి ఉంటే... మిగతా అధికారులు రాష్ట్రంలో ఎలా పని చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్ వ్యవహరంతో ఇతర అధికారులు కూడ డిప్యూటేషన్ పై పారిపోయెందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఇక సీఎం వద్ద తొత్తులుగా పనిచేసే వారినే అధికారులుగా కొనసాగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొంతమంది అధికారులకు కనీసం రాజ్యసభ సభ్యులతోపాటు ఇతర నేతలు కూడ తెలియని దుస్థితిలో ఉన్నారని అన్నారు.

AP CS L.V. Subramanyam transfer improper : MP Sujana Chowdary

ఇక ఆరునెలల్లో జగన్ తన పరిపాలన మార్కును చూపిస్తానని చెప్పారని ,కాని ఆయన వ్యవహరశైలితో ఉన్న పరిశ్రమలు తరలి వెళుతున్నాయని విమర్శించారు. ఇప్పటివరకు జగన్ ఎన్ని కొత్త ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీకి ప్రజలు పూర్తి మెజారిటి ఇచ్చారని, ఇప్పటికైన సీఎం జగన్‌మోహన్ రెడ్డి పొరపాట్లను సరిద్దిద్దుకుని పరిపాలన కొనసాగించాలని ఆయన సూచించారు. లేదంటే రాష్ట్రం కొలుకోవడం చాల కష్టమని అన్నారు.

ఇక రాష్ట్ర అభివృద్దిపై కేంద్రం చేపట్టిన చర్యలపై ఆయన స్పందించారు. పార్లమెంట్‌ చట్టం ప్రకారం కేంద్రం ప్రకటించిన హామీలతోపాటు , ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత ప్రభుత్వం విడుదల చేయాలని.. అప్పుడే రాష్ట్రానికి కావాల్సిన అభివృద్దిపై కేంద్రాన్ని నిలదీసే అవకాశాలు ఉంటాయని అన్నారు. మరోవైపు టీడీపీ, వైసీపీలు కూడ తమకు రాజకీయ ప్రత్యర్థులని పేర్కోన్నారు.

English summary
MP Sujana Chowdary has objected the sudden transfer of L.V. Subramanyam chief Secretary of AP. and it would create insecurity feelings among other officials he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X