వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబునాయుడు పవర్ లో ఉన్న పవర్ లెస్ సీఎం .. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలనం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ లెస్ సీఎం అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి . చంద్రబాబు ముఖ్యమంత్రే అని.. అయితే అధికారాలు మాత్రం ఉండవని ఏపీ సీఎస్ స్పష్టం చేశారు .

ఎన్నికల ఫలితాలవరకు చంద్రబాబు పవర్ లెస్ సీఎం

ఎన్నికల ఫలితాలవరకు చంద్రబాబు పవర్ లెస్ సీఎం

ఎన్నికల సమయంలో ఏపీలో పరిపాలనపై సమీక్షలకు సంబంధించి పర్యవేక్షణ అంతా ఈసీ మరియు సీఎస్ పరిధిలోనే ఉంటుందని చెప్పారు సీఎస్ సుబ్రహ్మణ్యం . ఫలితాలు వెల్లడయ్యే మే 23వ తేదీ వరకు చంద్రబాబు సీఎం గా ఉన్నా అధికారాలు లేని సీఎం అని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాల వరకు పార్టీ అధినేతలు వేచి చూడాలన్నారు.రిజల్ట్స్ వచ్చిన తర్వాత.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గెలిస్తే.. మే 24వ తేదీనే సీఎం ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు.. అదే టీడీపీ గెలిస్తే చంద్రబాబు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించవచ్చు అన్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి అధికారాలు ఉంటాయో ఆ పరిధిలోనే పని చెయ్యాలన్న సీఎస్

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి అధికారాలు ఉంటాయో ఆ పరిధిలోనే పని చెయ్యాలన్న సీఎస్

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి అధికారాలు ఉంటాయి అనేది స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్న ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వాటిని ఆయా వ్యక్తులకు కూడా సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. ఎవరి పరిధిలో వాళ్లు పని చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.టెక్నికల్ గా చూస్తే చంద్రబాబు సీఎం అయినా ,కేర్ టేకర్ కాదన్నారు.

కోడ్ సమయంలో అధికారిక ఉత్తర్వులు జారీ చెయ్యటానికి వీలులేదు అన్న సీఎస్

కోడ్ సమయంలో అధికారిక ఉత్తర్వులు జారీ చెయ్యటానికి వీలులేదు అన్న సీఎస్

చంద్రబాబు సీఎంగానే ఉన్నా పవర్ మాత్రం ఉండదన్నారు. మే 23వ తేదీ వరకు ఆయన ఆఫీసు నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయటానికి వీలు లేదన్నారు . మే 23వ తేదీ తర్వాత ఎవరు గెలిస్తే వాళ్లు ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చని సూచించారు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. అప్పటి వరకు పవర్ లో ఉన్నా పవర్ లెస్ సీఎంగా ఉండాల్సిందేనని ఆయన తెలిపారు.

English summary
Chief Minister Chandrababu Naidu does not enjoy any power as regular chief minister and cannot conduct the review meetings as he wants to do. He said technically Naidu is not caretaker chief minister, but the fact is he is CM without powers. Naidu will have to lay down office after May 23 if he does not get re-elected. Stating constitutional position, the chief secretary said after the results Whosoever becomes the CM, the state administration then will have to cooperate with them, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X