అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో మళ్లీ 4 వేలు దాటిన కరోనా కేసులు- టాప్‌లో తూర్పు-లాస్ట్‌లో పశ్చిమగోదావరి

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. గతంలో తగ్గినట్లే తగ్గి మళ్ల విజృంభించిన కరోనా కేసులు క్రమంగా పాత స్ధాయికి చేరేలా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా నిలకడగా దాదాపు 4 వేల కేసులు నమోదవుతుండగా.. గత 24 గంటల్లో మరోసారి అదే రికార్డు నమోదైంది. అయినా రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య భారీగా తగ్గిపోవడం ఆందోళన రేపుతోంది.

Recommended Video

#coronaap #ap 14-4-2021 ఏపీ కరోనా అప్డేట్: ఒక్కరోజులోనే 18 కరోనా మరణాలు

ఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలుఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలు

ఏపీలో గత 24 గంటల్లో మరోసారి 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో నమోదైన 4157 కేసుల్ని పరిశీలిస్తే తూర్పుగోదావరిలో అత్యధికంగా 617 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానాల్లో శ్రీకాకుళం 522, చిత్తూరు 517, గుంటూరు 434, విశాఖ 417, కర్నూలు 386 వచ్చాయి. 300 కంటే తక్కువ కేసులున్న జిల్లాల్లో అనంతపురం 297, నెల్లూరు 276, ప్రకాశం 230, విజయనగరం 154, కృష్ణా 135, కడప 112, పశ్చిమగోదావరి 60 కేసులు వచ్చాయి.

ap daily covid cases crosses 4k once again, east godavari on top, west godavari on last

వీటితో కలుపుకుటే ఇప్పటివరకూ నమోదైన మొత్తే పాటిజివ్‌ కేసుల సంఖ్య 9.37 లక్షలకు చేరింది. ఇందులో 9 లక్షల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 28 వేల యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 7339మంది చనిపోయారు. ఇందులో గత 24 గంటల్లో చనిపోయిన వారిని పరిశీలిస్తే... నెల్లూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, అనంత, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూల్‌, ప్రకాశం, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చనిపోయారు.

English summary
daily covid 19 cases records more than 4000 in last 24 hours in andhra pradesh as east godavari stands top on new cases and west godavari in last position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X