వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెఇకి షాక్: కమిటీలో లోకేష్ కు చోటు, జగన్ పార్టీ టార్గెట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవిన్యూ శాఖ మంత్రికి కాకుండా ఇద్దరు జూనియర్ మంత్రులకు భూ కేటాయింపుల భాద్యతను అప్పగించడం విస్మయం కలిగించింది. ఎపీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి చంద్రబాబుకు సమకాలీకుడు. ఆయన ఆధ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవిన్యూ శాఖ మంత్రికి కాకుండా ఇద్దరు జూనియర్ మంత్రులకు భూ కేటాయింపుల భాద్యతను అప్పగించడం విస్మయం కలిగించింది. ఎపీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి చంద్రబాబుకు సమకాలీకుడు. ఆయన ఆధీనంలోనే రెవిన్యూ శాఖ ఉంది.అయితే రెవిన్యూ శాఖ భూ కేటాయింపుల వ్యవహరాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది,. కానీ, ప్రభుత్వం మాత్రం ఆయనకు ఈ బాధ్యతను అప్పగించలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కేటాయింపుల కమిటీలో చినబాబు లోకేష్ కు చోటు దక్కింది.నిజానికి భూముల వ్యవహాలన్నీ రెవిన్యూ శాఖ చూడాల్సి ఉంటుంది. కానీ,ప్రభుత్వం మాత్రం ఆయనకు ఆ బాధ్యతను అప్పగించకపోవడం చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి.

వివిధ పరిశ్రమలు, కంపెనీలను ఆకర్షించే పనిలో ఉన్న ప్రభుత్వం, అందుకు అవసరమైన భూములను కేటాయించేందుకు సిద్దమౌతోంది. అయితే భూ కేటాయింపుల వ్యవహరాన్ని సీనియర్ మంత్రిని కాదని జూనియర్ మంత్రికి కట్టబెట్టడమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అయితే ఏకంగా భూ కేటాయింపుల కమిటీల్లో ఇద్దరు జూనియర్ మంత్రులకు స్థానం కల్పించడం కూడ చర్చకు దారితీస్తోంది. సీనియర్లను వదిలి జూనియర్లకు ఇంతటి కీలకమైన బాధ్యతలను అప్పగించడంలో ఆంతర్యమేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

కెఇని పక్కన పెట్టారంటూ విపక్షాల విమర్శలు

కెఇని పక్కన పెట్టారంటూ విపక్షాల విమర్శలు

పరిశ్రమలకు భూ కేటాయింపుల విషయంలో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తిని పక్కనపెట్టారంటూ వైసీపీ తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టింది. భూ కేటాయింపుల విషయంలో నారాలోకేష్ కు ఏం అనుభవం ఉందని భూ కేటాయింపుల కమిటీలో చోటు కల్పించారని ప్రశ్నించారు. అంతేకాదు కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన నారాలోకేష్ తోపాటు నక్కా ఆనంద్ బాబులను ఈ కమిటీలో చేర్చడంపై కూడ వైసీపీ విమర్శలు గుప్పించింది. రెవిన్యూశాఖను నిర్వహిస్తున్న సీనియర్ మంత్రి కెఇ కృష్ణమూర్తిని పక్కనపెట్టి ఆయనను అవమానించారని ఆ పార్టీ విమర్శలు చేసింది.బిసిలను అవమానపరుస్తున్నారని ఆ పార్టీ నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు.

మూడేళ్ళుగా నారాయణకు భూ కేటాయింపుల వ్యవహరం

మూడేళ్ళుగా నారాయణకు భూ కేటాయింపుల వ్యవహరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి నారాయణకే మూడేళ్ళుగా భూ కేటాయింపుల వ్యవహరాన్ని చూస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో కెఇ కృష్ణమూర్తి డిప్యూటీ సిఎంగా ఉన్నారు.అంతేకాదు ఆయన రెవిన్యూశాఖను కూడ అప్పగించారు.అయితే మున్సిఫల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణకు మూడేళ్ళుగా భూకేటాయింపుల వ్యవహరాన్ని అప్పగించారు.అయితే అప్పట్లోనే ఈ వ్యవహరంపై విమర్శలు వెల్లువెత్తాయి.అయితే ఈ కమిటీలో యనమలరామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, నారాలోకేష్ లకు చోటు కల్పిస్తూ గురువారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ ఉత్తర్వుల్లో కూడ కెఇకి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వంలో లోకేష్ పాత్ర స్పష్టం

ప్రభుత్వంలో లోకేష్ పాత్ర స్పష్టం

పరిశ్రమలకు భూ కేటాయింపుల వ్యవహరంలో చోటు దక్కించుకొన్న నారాలోకేష్ మరోసారి ప్రభుత్వంలో తన స్థానం ఏమిటో నిరూపించుకొన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రభుత్వం ఏర్పాటుచేసే అన్ని రకాల కమిటీల్లో లోకేష్ కు స్థానం ఉండే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరు విపక్షాలకు ఆయుధంగా మారింది.

విపక్షాల విమర్శలకు సరైన సమాధానం చెప్పని టిడిపి

విపక్షాల విమర్శలకు సరైన సమాధానం చెప్పని టిడిపి

భూ కేటాయింపుల కమిటీలో డిప్యూటీ సిఎం కెఇని పక్కన పెట్టారనే వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసింది. బిసి అయినందునే ఆయనను పక్కన పెట్టారని ఆరోపణలు చేసింది.అయితే ఈ ఆరోపణలను టిడిపి తీవ్రంగా ఖండించింది. కమిటీలో సభ్యుడిగా ఉన్న యనమల రామకృష్ణుడు బిసి అనే విషయాన్ని టిడిపి గుర్తు చేసింది.అయితే రెవిన్యూశాఖను నిర్వహిస్తున్న కెఇని కాదని భూ కేటాయింపుల వ్యవహరాన్ని ఎందుకు మూడేళ్ళుగా నారాయణకు కట్టబెట్టారనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

ఏ అర్హత ఉందని లోకేష్ కు స్థానం?

ఏ అర్హత ఉందని లోకేష్ కు స్థానం?

సీనియర్ మంత్రులు ఉండాల్సిన భూ కేటాయింపుల కమిటీలో ఏ అర్హత ఉందని లోకేష్ కు స్థానం కల్పించారని వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కిననాటి నుండి తన కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేయాలనే తాపత్రయంతోనే పనిచేస్తున్నారని చెప్పారు. ఆయనకు ఏ మాత్రం ప్రజాస్వామ్యం విలువలు లేవన్నారు. లోకేష్ ను 2015 సెప్టెంబర్ 30న, పార్టీ జాతీయ కార్యదర్శిగా చేశారని చెప్పారు. ఈ ఏడాది మార్చి 30న, ఎమ్మెల్సీ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత రెండురోజులకే మంత్రిని చేశారని చెప్పారు.నెలరోజులకే సీనియర్ మంత్రులు ఉండాల్సిన కమిటీలో ఆయనను సభ్యుడిగా చేశారని చెప్పారు. బాబుకు కుమారుడి పట్ల ఆరాటం కన్పిస్తోందని చెప్పారు. పెట్టుబడిదారులకు భూపందేరం కోసమే ఇలా చేశారని ఆయన ఆరోపించారు.బీసీలకు చెందిన ఉపముఖ్యమంత్రిని కమిటీ నుండి పక్కకు తప్పించారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

English summary
Andhra pradesh Deputy chief minister KE Krishnamurthy didn't get place in land acquisition committee.Nara Lokesh and Nakka Anand babu got place in this committee.But KE Krishnamurhty didn't got place in this committee, opposition parties questiong about this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X