వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి చంద్ర‌బాబు: స‌్వ‌యంగా ఆహ్వానించిన జ‌గ‌న్: ఆస‌క్తి క‌ర సంభాష‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్ర‌బాబుకు,జ‌గ‌న్ ఫోన్... ఇద్దరిమధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌!! | Oneindia Telugu

ఏపీ రాజ‌కీయాల్లో ఒక అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎన్నిక‌ల్లో హోరా హోరీ త‌ల‌ప‌డిన రెండు పార్టీల అధినేత‌లు న‌వ్వుకుంటూ..కుశ‌ల ప్ర‌శ్న‌ల‌తో..స‌ర‌దాగా...హుందాగా మాట్లాడుకున్నారు. ఈనెల 30న ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్న జ‌గ‌న్‌..టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఫోన్ చేసారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తి క‌ర సంభాష‌ణ చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ అంశం రెండు పార్టీల్లోనూ ఆస‌క్తి క‌రంగా మారింది.

ప్రమాణ స్వీకారానికి రండి..
ఈ నెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్న జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ స్వ‌యంగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసారు. కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసారు. ఈ నెల 30న త‌న ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావాల‌ని ఆహ్వానించారు. మోదీ..కేసీఆర్‌ను ఆహ్వానించిన విష‌యం సైతం చంద్ర‌బాబుతో పంచుకున్నారు. ఏపీ అభివృద్ది లో మీ స‌హ‌కారం. కావాల‌ని కోరారు.

దీనికి చంద్ర‌బాబు సైతం సానుకూలంగా స్పందించారు. ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత మీడియా సమావేశంలో జ‌గ‌న్ కు శుభాకాంక్ష‌లు చెప్పిన చంద్ర‌బాబు..ఈ రోజు జ‌గ‌న్ ఫోన్ చేసిన స‌మ‌యం లోనూ మ‌రో సారి శుభాకాంక్ష‌లు చెప్పారు.త‌మ నుండి కొత్త ప్ర‌భుత్వానికి పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. కుటుంబ స‌భ్యుల‌తో స‌హా రావాల‌ని జ‌గ‌న్ మ‌రోసారి కోర‌గా...చంద్ర‌బాబు స‌మ్మ‌తించారు.

AP designated CM Jagan called TDP Chief Chandra Babu to his swearing ceremony on 30th of this month


చంద్ర‌బాబు వస్తారా..ప్ర‌తినిధుల‌ను పంపుతారా..
ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌రువాత నేరుగా జ‌గ‌న్ ఫోన్ చేసి త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాల‌ని ఆహ్వానించ‌టంతో ఇప్పుడు చంద్ర‌బాబు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతారా లేక త‌న ప్ర‌తినిధులుగా పార్టీ నేత‌ల‌ను పంపుతారా అనే చ‌ర్చ మొదలైంది. గ‌తంలో చంద్ర‌బాబు సైతం 2014లో త‌న ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావాల‌ని జ‌గ‌న్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారు.

అయితే, జ‌గ‌న్ హాజ‌రు కాలేదు. 2004, 2009 లోనూ వైయ‌స్సార్ ప్ర‌మాణ స్వీకారానికి చంద్ర‌బాబు హాజ‌రు కాలేదు. అయితే, ఇప్పుడు చంద్ర‌బాబు మ‌రి జ‌గ‌న్ ఆహ్వానం మేర‌కు వ‌స్తారా..రారా అనే చ‌ర్చ మొద‌లైంది. దీని పైన బుధ‌వారం జ‌రిగే టీడీపీ లెజిస్లేచ‌ర్ పార్టీ స‌మావేశంలో చంద్ర‌బాబు తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే, ఇప్ప‌టికే కేసీఆర్‌తో పాటుగా బీజేపీ కేంద్ర నేత‌లు జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి వ‌స్తున్న‌ట్లుగా స‌మాచారం అందింది.

English summary
AP designated CM Jagan called TDP Chief Chandra Babu to his swearing ceremony on 30th of this month. Chandra Babu also congratulated Jagan for his victory in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X