వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా సుబ్ర‌మ‌ణ్యం శ్రీరాం: అద‌న‌పు ఏజీగా సుధాక‌ర్ రెడ్డి: ఈ ఇద్ద‌రే ఎందుకంటే..!

|
Google Oneindia TeluguNews

ఏపీ నూత‌న మ‌ఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వుల్లో స‌మ‌ర్ధుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీనికి అనుగుణంగా ప్ర‌భుత్వానికి కీల‌క‌మైన అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌తో పాటుగా అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ గా ఎవ‌రిని నియ‌మించాలో నిర్ణ‌యించారు. అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా సుబ్ర‌మ‌ణ్యం శ్రీరాం..అద‌న‌పు అడ్బ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా సుధాక‌రెడ్డి పేర్లు ఖ‌రారు చేసారు. వీరిని జ‌గ‌న్ ఎంపిక చేయ‌టం వెనుక భారీ క‌స‌ర‌త్తు జ‌రిగింది.

ఆ ఇద్ద‌రికీ అవ‌కాశం ..
టీడీపీ ప్రభుత్వంలో అడ్వకేట్‌ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఆ పదవిలో కొత్త వ్యక్తి పేరును ఖరారు చేసింది. అడ్వకేట్‌ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరాంను, అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేరును కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఖరారు చేసారు. సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వీరిద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇక‌, ఇదే స‌మ‌యంలో టీడీపీ హయాంలో నియమితులైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిళ్లు కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, జీపీలు, ఏజీపీలు, స్టాండింగ్‌ కౌన్సిళ్ల నియామకాలను పూర్తి చేసేందుకు ఏజీగా, అడిషనల్‌గా ఏజీగా నియమితులు కానున్న శ్రీరాం, పొన్నవోలు ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలిసింది.

AP Designated CM Jagan decided to appoint Subramnyam Sriram as Advocate general..

ఆ ఇద్ద‌రికే ఎందుకంటే..
సుబ్ర‌మ‌ణ్యం శ్రీరాం గ‌తంలో 2009-2011 మ‌ధ్య కాలంలో నాటి అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ డీవీ సీతారామ మూర్తి వ‌ద్ద ప్ర‌భుత్వ న్యాయ‌వాదిగా ప‌ని చేసారు. 1969 జౌలై 5న జ‌న్మించిన శ్రీరాం 1996 నుండి న్యాయ‌వాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. కానిస్టిట్యూష‌న‌ల్ లా, విద్యా, సర్వీసు, సివిల్, క్రిమిన‌ల్‌, క‌మర్షియ‌ల్ రంగాల్లో చ‌ట్టాల పైన ప్రావీణ్యం సాధించారు. ఇక‌, అద‌నపు అడ్వ‌కేట్ జ‌నర‌ల్‌గా ఎంపికైన సుధ‌కార్ రెడ్డి వైసీపీకి సంబంధించి అనేక కేసుల్లో వాద‌న‌లు చేసారు. ఓట్ల గ‌ల్లంతు.. స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారం..చంద్ర‌బాబు పైన ఓటుకు నోటు కేసులో ఆర్కే ఇంప్లీడ్ అయిన స‌మ‌యంలో ఆయ‌న వాద‌న‌లు వినిపించారు. దీంతో..ఆయ‌నకు అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా అవ‌కాశం క‌ల్పించారు.

English summary
AP Designated CM Jagan decided to appoint Subramnyam Sriram as Advocate general and Sudhakar Reddy as additional advocate general in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X