• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జ‌గ‌న్ వీరిని ఆహ్వానించారు : మ‌రి ఆ ఒక్క‌రిని మరిచారా..వ‌ద్ద‌నుకున్నారా: కార‌ణం ఇదేనా..!

|

ఏపీకీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ఈనెల 30న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. త‌న ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావాల‌ని జ‌గ‌న్ స్వ‌యంగా ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీని..బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాను ఆహ్వానించారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి టీడీపీ అధినేత చంద్ర‌బాబు..డీఎంకే అధినేత స్టాలిన్‌కు ఫోన్ చేసి మ‌రీ ఆహ్వానం ప‌లికారు. అయితే, ఆ ఒక్క‌రిని మాత్రం జ‌గ‌న్ పిల‌వ‌లేదు. ఆ ఒక్క‌రినీ మ‌రిచారా లేక వ‌ద్ద‌నుకున్నారా అనేదే ఇప్పుడు చ‌ర్చ‌...

ప్ర‌ముఖ‌ల‌కు జ‌గ‌న్ ఆహ్వానం..

ప్ర‌ముఖ‌ల‌కు జ‌గ‌న్ ఆహ్వానం..

ఏపీలో టీడీపీని ఓడించి వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా జ‌గ‌న్‌ను ఆ పార్టీ శాస‌న స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు నివేదించారు. తాము ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌టానికి సిద్దంగా ఉన్నామ‌ని సంసిద్ద‌త వ్య‌క్తం చేసారు. అక్క‌డే గ‌వ‌ర్న‌ర్ ఏపీలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌టానికి ఆహ్వానించారు. దీని కోసం ఈనెల 30వ తేదీ మ‌ధ్నాహ్నం 12.23 గంట‌ల‌కు ముహూర్తంగా ఖ‌రారు చేసారు. ఆ వెంట‌నే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్ద‌కు స‌తీ స‌మేతంగా వెళ్లి త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాల్సిందిగా జ‌గ‌న్ ఆహ్వానించారు. ఇక‌, ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయిన జ‌గ‌న్ త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాల‌ని ఆహ్వానించ‌గా..త‌న ప్ర‌మాణ స్వీకారం సైతం అదే రోజు ఉండ‌టంతో..త‌న ప్ర‌తినిధుల‌ను పంపిస్తాన‌ని హామీ ఇచ్చారు. బిజేపీ జాతీయాధ్య‌క్షుడుని క‌లిసి ఆహ్వానించారు.

చంద్ర‌బాబు..స్టాలిన్‌కు ఆహ్వానం..

చంద్ర‌బాబు..స్టాలిన్‌కు ఆహ్వానం..

ఇక‌, జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం దగ్గ‌ర ప‌డుతుండ‌టంతో జ‌గ‌న్ స్వ‌యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఫోన్ చేసి 30న త‌న ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావాల‌ని ఆహ్వానించారు. ఏపీ అభివృద్దికి మీ స‌హాయ స‌హ‌కారాలు కావాల‌ని కోరారు. జ‌గ‌న్ పోన్ కాల్‌కు చంద్ర‌బాబు సైతం సానుకూలంగా స్పందించారు. అదే విధంగా డీఎంకే అధినేత స్టాలిన్ కు ఫోన్ చేసి ఆహ్వానం ప‌లికారు. దీంతో...జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి కేసీఆర్‌..స్టాలిన్ రాక ఖారారైంది. గ‌వ‌ర్న‌ర్ ముందు రోజు సాయంత్ర‌మే విజ‌య‌వాడ‌కు చేరుకుంటున్నారు. ఈ ముగ్గురి రాక ఖ‌రారు కావటంతో అధికారులు వీరి కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఆ ఒక్కిరినీ విస్మ‌రించారా..లేక‌

ఆ ఒక్కిరినీ విస్మ‌రించారా..లేక‌

ఇంత మంది ప్ర‌ముఖ‌ల‌ను ఆహ్వానించిన జ‌గ‌న్ ఒక్క‌రి విష‌యంలో మాత్రం విస్మరించారు. ఏపీ ఎన్నిక‌ల్లో త‌ల ప‌డిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌ను జ‌గ‌న్ ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం లేదు. జ‌న‌సేన పార్టీ సౌతం ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ద‌క్కించుకుంది. ఒక్క ఎమ్మెల్యేతో జ‌న‌సేన ఏపీ అసెంబ్లీలో ఎంట‌ర్ అవుతోంది. అయితే, ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారానికి జ‌నసేన అధినేత‌నున సైతం ఆహ్వానిస్తే..జ‌గ‌న్ తాను చెబుతున్న‌ట్లుగా ఎటువంటి రాజ‌కీయ బేష‌జాల‌కు అవ‌కాశం లేకుండా ఉన్న‌ట్లు క‌నిపించేద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. అయితే, ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో సైతం జ‌గ‌న్ ఎక్క‌డా ప‌వ‌న్ పేరు ప్ర‌స్తావించ లేదు. కేవ‌లం చంద్ర‌బాబు పార్ట‌న‌ర్..యాక్ట‌ర్ అంటూనే ప్రచారం చేసారు. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ చివ‌రి నిమిషంలో ఆహ్వానిస్తారా..లేక విస్మ‌రిస్తారా అనేది చూడాలి. ఇప్పుడు ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

English summary
AP Designated CM Jagan invited key leaders for his swearing ceremony but he did not invited Janasena chief Pawan Kalyan for this event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X