అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు అమరావతి టూర్...సిట్ ఏర్పాటు: దాడులపైన విచారణ: వారంరోజుల్లో నివేదిక..!

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన సమయంలో చోటు చేసుకున్న పరిణామాల పైన విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తమ అధినేత కాన్వాయ్ పైన వైసీపీ నేతలు దాడులు చేయించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ఒక పోలీసు చంద్రబాబు ప్రయాణీస్తున్న బస్సుపైన లాఠీ వేసారని చెప్పుకొచ్చారు. అయితే, డీజీపీ మాత్రం చంద్రబాబుపైన చెప్పు వేసింది ఒక రైతు అని.. అదే విధంగా రాళ్లు వేసింది ఒక రియల్టర్ అని ప్రకటన చేసారు. చంద్రబాబు కారణంగా నస్టపోయామని వారు చెబుతున్నారని..వారిని అరెస్ట్ చేసామని స్పష్టం చేసారు. ఇప్పటికే వారిద్దరూ సందీప్..బాపయ్య లను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే, వైసీపీ నేతలకు మద్దతుగా డీజీపీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ మీద కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్ లో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు పర్యటన సమయంలో ఏ రకంగా వ్యవహరించిదీ ప్రస్తావించాలని నిర్ణయించింది. ఈ సమయంలో మొత్తం వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ గౌతం సవాంగ్ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది.

వారం రోజుల్లో నివేదిక..
చంద్రబాబు అమరావతి పర్యటనకు ప్రారంభమైన సమయం నుండి దాడులు..తుళ్లూరు స్టేషన్ లో నమోదైన కేసుల వరకు మొత్తం వ్యవహారం పైన సిట్ విచారించనుంది. చంద్రబాబు పర్యటనకు అడ్డుకున్న వారిని విచారించి..వారి నిరసనలకు కారణాలను తెలుసుకోనుంది. అదే విధంగా ఘర్షణలు ఎందుకు చోటు చేసుకున్నాయి...అదే సమయంలో పోలీసుల అలసత్వం మీద వస్తున్న విమర్శల మీద అదనపు ఎస్పీ విచారించనున్నారు. ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. ఇక, ఇప్పటికే టీడీపీ తమ పార్టీ ఎంపీలకు చంద్రబాబు పైన జరిగిన దాడి విషయాన్ని లోక్ సభలో ప్రస్తావించాలని సూచన చేసింది. సోమవారం సభలో ప్రస్తావించేందుకు పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు సిద్దం అవుతున్నారు. ఇక, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఎంపీలు లిఖిత పూర్వకంగా డీజీపీ పైన ఫిర్యాదు చేయనున్నారు.

AP DGP appointed SIT on Attacks on CBN canvoy at the time of Amaravati tour

స్పందించిన పోలీసు అధికారుల సంఘం..
టీడీపీ ప్రధానంగా ఈ వ్యవహారం వైసీపీతో పాటుగా డీజీపీని కార్నర్ చేస్తోంది. తాము ముఖ్యమంత్రి పర్యటనల సమయంలో నిరసనలకు దిగుతామని..తమను అడ్డుకుంటే డీజీపీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. డీజీపీ మీద టీడీపీ చేసిన వ్యాఖ్యలకు పోలీసు అధికారుల సంఘం స్పందించింది. ఏ పోలీసు అధికారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని స్పస్టం చేసారు. రాజకీయ వివాదాల్లోకి పోలీసులను తీసుకురావద్దని సూచించారు. దీనికి టీడీపీ నేతలు సైతం స్పందించారు. ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం మీద సిట్ ఏర్పాటు చేయటం తో మరో వారం రోజుల్లో చంద్రబాబు పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాల మొత్తం వ్యవహారం పైన సిట్ నివేదిక సమర్పించనుంది.

English summary
Special investigation team appointed for investigate total episode on CBN tour in amaravti and Attacks on his convoy. Govt seek report with in seven days time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X