తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూది సైకోను పట్టుకుంటాం, హైదరాబాద్‌లో సహకరిస్తాం: డిజిపి రాముడు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: సాధ్యమైనంత త్వరలో విజయవాడ నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ డిజిపి రాముడు అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలో పోలీస్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం పెరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం, తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఒకే సమయంలో జరుగుతున్నాయని చెప్పిన ఆయన, తిరుమలలో భద్రతా ఏర్పాట్లకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

AP DGP Ramudu launches Police Bhavan at Tirumala

హైదాబాద్‌లో వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సహకరిస్తారని డిజిపి రాముడు తెలిపారు. ఏపిలో రెచ్చిపోతున్న సూది సైకోను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్మగ్లర్ గంగిరెడ్డితోపాటు మరో ఇద్దరినీ విదేశాల నుంచి రప్పిస్తామని తెలిపారు.

తిరుమలలో భక్తీ రద్దీ

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 14గంటలు సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 12గంటల సమయం పడుతోంది.

English summary
AP DGP Ramudu has launched Police Bhavan at Tirumala on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X