వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వచ్చాక ఇదీ తేడా.. డిస్కంలకు బెనిఫిట్... విద్యుత్‌పై ఇంట్రెస్టింగ్ రిపోర్ట్...

|
Google Oneindia TeluguNews

బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు, బొగ్గు రవాణాలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ .4,783 కోట్లు ఆదా చేసినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగ సంస్థలు పేర్కొన్నాయి. రాబోయే అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన స్టేటస్ రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించాయి. 2019కి ముందు గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని అందులో పేర్కొన్నాయి.

ఈసారి 'ఫటాఫట్' మంత్ర.. జగన్ కీలక నిర్ణయం.. మునుపెన్నడూ లేని రీతిలో... ఈసారి 'ఫటాఫట్' మంత్ర.. జగన్ కీలక నిర్ణయం.. మునుపెన్నడూ లేని రీతిలో...

అప్పటి కొనుగోళ్ల తీరు..

అప్పటి కొనుగోళ్ల తీరు..

గత ప్రభుత్వంలో రెన్యువబుల్ ఎనర్జీని వాస్తవ ధరల కంటే అత్యధిక ధరకు కొనుగోలు చేశారని ఏపీ ట్రాన్స్‌కో ఒక ప్రకటనలో వెల్లడించింది. యూనిట్ సోలార్ విద్యుత్ రూ.3.54కే అందుబాటులో ఉండగా.. అప్పటి ప్రభుత్వం రూ.8.09కి దాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపింది. అలాగే యూనిట్ పవన విద్యుత్ రూ.2.94కే అందుబాటులో ఉండగా ప్రభుత్వం రూ.5.94కి కొనుగోలు చేసినట్టు తెలిపింది.

 ఆదాయం కంటే ఎక్కువ వ్యయంతో..

ఆదాయం కంటే ఎక్కువ వ్యయంతో..

గత ప్రభుత్వంలో ఏపీఎస్‌డీసీఎల్ ఆదాయం కంటే భారీ మొత్తాన్ని వెచ్చించి విద్యుత్ కొనుగోళ్లు చేసినట్టు వెల్లడించింది. 2015-16లో ఏపీఎస్‌డీసీఎల్ ఆదాయం రూ.11,526 కాగా రూ.14,920 వ్యయంతో విద్యుత్ కొనుగోళ్లు జరిపినట్టు వెల్లడించింది. అలాగే 2016-17లో ఆదాయం రూ.12,157 కోట్లు కాగా రూ.15,076కోట్లతో,2017-18లో ఆదాయం రూ.13,609 కోట్లు కాగా రూ.16,642 కోట్లతో,2018-19లో ఆదాయం రూ.14,956కోట్లు కాగా రూ.19,113 కోట్లతో విద్యుత్ కొనుగోళ్లు జరిపినట్టు తెలిపింది.

Recommended Video

టిడిపి MP Ram Mohan Naidu కి వైసిపి MP Vijaya Sai Reddy Counter
డిస్కంలకు బెనిఫిట్..

డిస్కంలకు బెనిఫిట్..

అదే జగన్ ప్రభుత్వం వచ్చాక సీన్ మారింది. ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో డిస్కంలకు రూ.4783 ఆదా అయింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు,బొగ్గు రవాణా చార్జీలను తగ్గించడం ద్వారా ఇది సాధ్యపడింది. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ దీనిపై మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యల కారణంగా డిస్కంలు లబ్ది పొందాయన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే అధిక విద్యుత్ లభిస్తుండటంతో.. మెరిట్ ఆర్డర్‌ను అనుసరించి ఎక్స్‌చేంజీల నుంచి వ్యూహాత్మక కొనుగోళ్లు జరిపినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి ప్రస్తుతం ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.1.63 నుంచి రూ.2.80కే కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు.

English summary
Following the measures taken by the new government, discoms were able to save Rs 4,783 crore. These savings were made by opting for open market purchase of cost effective power and reduction in coal transportation charges through reverse tendering
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X