వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఎంసెట్ 2018: హాల్ టిక్కెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు బుధవారం అంటే ఏప్రిల్ 18 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి తమ హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఆన్ లైన్ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ప్రక్రియ మంగళవారం నాడు సాయంత్రం వరకు పూర్తి కాలేదు. దీంతో హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్ ప్రక్రియలో ఆలస్యమైంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.

AP EAMCET 2018: Admit Cards to be Out Today

కాకినాడ జేఎన్టీయూ ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ ఏడాది పరీక్షకు 2,74,917 మంది విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ కోసం 1,98,231 మంది దరఖాస్తులు చేసుకోగా అగ్రికల్చరల్ కోర్సులకు 76,686 మంది విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంజినీరింగ్ పరీక్ష 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, వ్యవసాయం, వైద్య పరీక్షలు 25, 26వ తేదీల్లో జరగనున్నాయి.

హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు మే 5వ తేదీన వెల్లడిస్తారు. హాల్ టిక్కెట్లను sche.ap.gov.in/eamcet నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

English summary
The Jawaharlal Nehru Technological University (JNTU) will release the AP Engineering Agricultural and Medical Common Entrance Test (EAMCET) admit cards on April 18, 2018 i.e today. The JNTU will release the AP EAMCET 2018 admit cards at their official website, sche.ap.gov.in/eamcet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X