వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16న ఎంసెట్‌ ఫలితాలు : పది ఫలితాలు 13న : తుది క‌స‌ర‌త్తు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో కీల‌క ప‌రీక్షా ఫ‌లితాల విడుద‌ల‌కు తుది క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది. ప‌దో త‌ర‌గ‌తి...ఎంసెట్ ఫ‌లితాల విడ‌దుల కోసం ముహూర్తాల‌ను ప్రాధ‌మికంగా నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వంతో చ‌ర్చించిన త‌రువాత ఈరోజ సాయంత్రానికి అధికారికంగా విడుద‌ల తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.

16న ఎంసెట్ ఫ‌లితాలు..
ఏపీలో ఇప్ప‌టికే పూర్తయిన ఎంసెట్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను ఈనెల 16న విడుద‌ల చేసే అవ‌కాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీ వ‌ర‌కు ఎంసెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు 1,85,711 మంది, అగ్రికల్చర్‌ మెడికల్‌ విభాగంలో 81,916 మంది పరీక్ష రాశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియేట్‌ ఫలితాలను మొట్టమొదటి సారి గ్రేడ్‌ల విధానం లో విడుదల చేయడం, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్‌ ఫలితాలపై గందరగోళం నెలకొన డంతో ఈ ఏడాది ఫలితాలు విడుదల ఆలస్యమైంది.

AP EAMCET and 10th Results may release on 16th

ఎంసెట్‌ మార్కులు, ఇంటర్మీ డియేట్‌ మార్కుల వెయిటేజ్‌ను లెక్కించి ఈ నెల 16న ఫలితాలు, 13న ఈసెట్‌ ఫలితాలను, 14న పిజిసెట్‌ ఫలితాలను ఉన్నత విద్యామండలి విడుదల చేయాల‌ని ఇప్ప‌టికే సూత్ర ప్రాయంగా నిర్ణ‌యించింది. దీని పైన ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకొని తేదీల‌ను ప్ర‌క‌టించ‌నుంది.

15లోగా ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు..
మ‌రో వైపు పదో తరగతి ఫలితాల విడుదలపై ఎస్‌ఎస్‌సి బోర్డు కసరత్తు చేస్తోంది. మార్చి 18 నుంచి 30 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,23,354 మంది హాజ‌ర‌య్యారు. పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్‌ 27న ముగిసింది. పేపర్ల స్కానింగ్‌ కూడా పూర్తయిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల అంతర్గత మార్కులు ఆయా పాఠశాలలు కమిషనరేట్‌కు అందజేశాయి.

AP EAMCET and 10th Results may release on 16th

కమిషనరేట్‌ నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థుల అంతర్గత మార్కులు ఎస్‌ఎస్‌సి బోర్డుకు అందలేదని చెబుతున్నారు. కమిషనరేట్‌ తమకు అందించే అంతర్గత మార్కులు, పరీక్షల మార్కులు కలిపి విడుదల చేసేందుకు బోర్డు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. ఈ నెల 13 నుంచి 15 మధ్యలో ఏదోక రోజు ఫలితాలు విద్యాశాఖ కమిషనర్‌ విడుదల చేసేందుకు తుది క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ సాయంత్రం తేదీలు ఖ‌రారు కానున్నాయి.

English summary
AP EAMCET and 10th Results may release on 16th of this month. AP Higher Education and SSC Board planning to release results in next week. By to day evening dates will be finalized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X