వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుండి ఏపి ఎంసెట్ : నిమిషం ఆల‌స్య‌మైనా నో ఎంట్రీ : 23న ప్రాధ‌మిక కీ..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో నేటి నుండి అయిదు రోజుల పాటు ఎంసెట్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నిమిసం ఆల‌స్య‌మైనా ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌మ‌ని అధికారులు స్ప‌ష్టం చేసారు. మోహందీ ఉన్నా అనుమ‌తించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఈనెల 23న ఇంజ‌నీరింగ్ ప‌రీక్ష‌కు సంబంధించి ప్రాధ‌మిక కీ విడుద‌ల చేస్తామ‌ని నిర్వ‌హ‌కులు వెల్ల‌డించారు.

నేటి నుండి ఏపి ఎంసెట్‌

నేటి నుండి ఏపి ఎంసెట్‌

ఏపిలో నేటి నుండి ఎంసెట ప‌రీక్ష‌లు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86,910 మంది మొత్తంగా 2,82,633 మంది హాజరవుతున్నారు. ఈ నెల 24 వరకు పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగ‌నున్నాయి. పరీక్షను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాదులో నిర్వహిస్తున్నారు.
నిమిషం ఆల‌స్య‌మైనా పరీక్ష‌కు అనుమ‌తించ‌టం లేదు. ప‌రీక్ష హాల్‌లోకి గంట ముందే చేరుకోవాల‌ని నిర్వ‌హ‌కులు సూచించారు. అభ్య‌ర్దుల కోసం ప్ర‌త్యేక సదుపాయాలు..ర‌వాణా ఏర్పాట్లు చేసారు.

మెహందీ ఉంటే నో ఎంట్రీ..

మెహందీ ఉంటే నో ఎంట్రీ..

ఎంసెట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ పైన అభ్య‌ర్దుల‌కు అధికారులు ముందుగానే కొన్ని సూచ‌న‌లు చేసారు. ప‌రీక్ష‌కు ముందు బ‌యోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్ర‌ను..ఫొటోను స్వీక‌రిస్తున్నారు. విద్యార్దులు కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్‌లు, స్మార్ట్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకురాకూడదు. అలాగే మెహందీ, గోరింటాకు, టాటూలు వేసుకోకూడదని అధికారులు స్ప‌ష్టం చేసారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాలు ముందు మాత్రమే పాస్‌వర్డ్‌ను ప్రకటిస్తారు. విద్యార్థి రఫ్‌ వర్క్‌ చేసుకోవడానికి తెల్ల కాగితాలను సిబ్బంది ఇస్తారు. పరీక్ష అనంతరం వీటిని పరీక్షా హాల్‌లోనే తిరిగి ఇచ్చివేయా లని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభానికి ముందు కంప్యూటర్లో ఇవ్వబడిన సూచనలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకునేందుకు 15 నిమిషాలు కేటాయిస్తామ‌ని అధికారులు స్ప‌ష్టం చేసారు.

23న ప్రాథమిక కీ

23న ప్రాథమిక కీ

ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' ని ఈ నెల 23న విడుద‌ల చేయ‌నున్నారు. అదే విధంగా.. అగ్రికల్చర్, మెడికల్‌ ప్రవేశ పరీక్ష ప్రాథమిక 'కీ'ని ఈ నెల 24న ఎంసెట్‌ వెబ్‌సైట్లో పొందుపరుస్తామ‌ని అధికారులు స్ప‌ష్టం చేసారు. విడుద‌ల చేసిన‌ ‘కీ' పై ఏమైనా సందేహాలుంటే ఇంజనీరింగ్‌కు సంబంధించి ఈనెల 26వ తేదీ సాయంత్రం 5గంటలలోగా, అగ్రికల్చర్, మెడికల్‌కు సంబంధించి 27వ తేదీ సాయంత్రం 5గంటలలోగా నిర్దేశించిన ఫార్మాట్లో ఎంసెట్‌ వెబ్‌సైట్లో పేర్కొన్న మొయిల్‌ ఐడీకి తమ అభ్యంతరాలను తెలియచేయాల‌ని సూచించారు ఇక‌, ప‌రీక్షా ఫలితాలను మే రెండవ వారంలో విడుదల చేసే విధంగా యాక్ష‌న్ ప్లాన్ సిద్దం చేసారు.

English summary
EAMCET exams in AP start to day on wards. Exams will be conduct for five days. Exams key released on 23rd of this month and Results in may second week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X