వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ సర్కారుకు మరో షాక్‌- స్ధానిక ఎన్నికలకు నిమ్మగడ్డ రెడీ-హైకోర్టులో అఫిడవిట్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వాయిదా పడిన స్ధానిక సంస్ధలను త్వరలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు రాష్ట్రంలో కార్యకలాపాలు సాధారణ స్ధితికి చేరుకోవడంతో స్ధానిక పోరు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సిద్దమవుతున్నారు. ఈ మేరకు హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ కూడా దాఖలు చేశారు. కరోనా తగ్గడంతో స్ధానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ సిద్ధంగా ఉన్నట్లు ఆయన హైకోర్టుకు తెలిపారు. దీంతో స్ధానిక పోరును ఎలాగైనా వాయిదా వేయాలన్న వైసీపీ సర్కారు ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఏపీలో స్ధానిక ఎన్నికలు...

ఏపీలో స్ధానిక ఎన్నికలు...

ఏపీలో వాయిదా పడుతూ వస్తున్న స్ధానిక సంస్ధల ఎన్నికలను ఈ ఏడాది మార్చిలో ఎలాగైనా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి అభిప్రాయాలూ లేవు. ప్రభుత్వం కోరుకున్న విధంగానే ఆయన స్ధానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. నోటిఫికేషన్‌ జారీ నుంచి మొదలుపెట్టి ఎన్నికల పోలింగ్‌ వరకూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వం తమ అధికార బలంతో పలు చోట్ల ఏకగ్రీవాలకు ప్రయత్నిచింది. వీటిని అడ్డుకోవాలంటే నిమ్మగడ్డకు ప్రభుత్వంలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల మద్దతు కావాలి. అక్కడే తేడా కొట్టింది. అధికార పార్టీ ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్న సమయంలో దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నిమ్మగడ్డకు చుక్కెదురైంది. ఆ తర్వాత కరోనా ప్రభావం మొదలుకావడంతో నిమ్మగడ్డ ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వానికి షాకిస్తూ ఎన్నికలు వాయిదా వేసేశారు.

నిమ్మగడ్డతో ప్రభుత్వం తాడోపేడో..

నిమ్మగడ్డతో ప్రభుత్వం తాడోపేడో..


కరోనా పేరుతో తమకు అనుకూలంగా సాగిపోతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలను నిమ్మగడ్డ అర్దాంతరంగా వాయిదా వేసేయడంతో ఆగ్రహంతో సీఎం జగన్‌.. రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా ఓ ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను తొలగించారు. ఆయన స్ధానంలో జస్టిస్ కనగరాజ్‌ను తీసుకొచ్చారు. చివరికి న్యాయస్దానాలు కనగరాజ్‌ను తొలగించి తిరిగి నిమ్మగడ్డను పునఃప్రతిష్ట చేశాయి. దీంతో ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం నిమ్మగడ్డ పదవిలో ఉండగా ఎట్టిపరిస్ధితుల్లోనూ స్ధానిక పోరు నిర్వహించకూడదని పట్టుబట్టింది. నవంబర్‌, డిసెంబర్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉందని, అందుకే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రులు చెబుతున్నారు. అయినా మిగతా రాజకీయ పార్టీలన్నీ కలిసి రావడంతో నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు.

హైకోర్డు అండతో స్ధానిక పోరు...

హైకోర్డు అండతో స్ధానిక పోరు...


ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌తో చెలరేగిన వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన ప్రభుత్వం పంతాలకు పోయి ఎదురుదెబ్బలు తినాల్సిన పరిస్ధితి తెచ్చుకుంది. అయినా ఇప్పటికీ ఏమాత్రం మార్పు లేదు. స్ధానిక పోరుపై అభిప్రాయాలు చెప్పమని నిమ్మగడ్డ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తే.. దానికి వెళ్లకుండా గతంలో ఆయన తమపై కక్షసాధించారని వైసీపీ చెప్పుకుంది. దీంతో నిమ్మగడ్డతో పోరును ప్రభుత్వం కొనసాగిస్తుందని అర్ధమైంది. ఆయన స్ధానిక ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వం నిధులు కూడా కేటాయించకుండా ఇబ్బందిపెట్టింది. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ఇదే అదనుగా నిమ్మగడ్డ రమేష్‌ స్ధానిక పోరుకు సిద్దంగా ఉన్నట్లు హైకోర్టుకు తెలిపారు.

వైసీపీ సర్కారుకు భారీ షాక్‌..

వైసీపీ సర్కారుకు భారీ షాక్‌..

ఏపీలో నిమ్మగడ్డ పదవిలో ఉండగా స్ధానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయాలని భావించిన వైసీపీ సర్కారు ఇప్పుడు హైకోర్టులో ఎస్‌ఈసీ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌తో ఇరుకునపడింది. ఇప్పుడు హైకోర్టు ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఆదేశాలు ఇస్తే తప్పకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్ధితి వస్తుంది. కరోనా సెకండ్‌ వేవ్ పేరుతో ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నెరవెరేలా కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం కరోనా తగ్గిందని స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టును కోరినా ఫలితం ఉంటుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. ఇప్పటికే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలు నెరవేరతాయా అంటే అనుమానమే. దీంతో నిమ్మగడ్డ వేసిన పాచిక పారేలా కనిపిస్తోంది.

English summary
andhra pradesh state election commission is ready to hold local body elections which were postponed earlier this year march due to covid 19 affect. sec filed a affidavit in high court in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X