వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల డెడ్‌లైన్...! వెంటనే తేల్చండి లేదంటే సెప్టెంబర్ 1న బ్లాక్ డే..!!

|
Google Oneindia TeluguNews

తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నిర్ణయించింది. ముఖ్యంగా కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్) పై రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని తెలియజేయకపోతే సెప్టెంబరు 1న రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ డేగా ప్రకటించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నిర్ణయించింది. సిపిఎస్ విధానంపై జగన్ సర్కార్ ఇప్పటివరకు ఎటూ తేల్చ లేదు అని దీనిపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చర్చించింది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య విస్తృతస్థాయి సమావేశం.. సీపీఎస్ రద్దు డిమాండ్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య విస్తృతస్థాయి సమావేశం.. సీపీఎస్ రద్దు డిమాండ్

విజయవాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎస్ కు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది .సిపిఎస్ రద్దు చేస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఇప్పుడు సిపిఎస్ రద్దు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు అని చర్చించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేతలు. సీపీఎస్‌ రద్దుచేయాలంటూ గత కొన్నేళ్లుగా ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. ఇక సిపిఎస్ రద్దు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది .ఎన్నికల ప్రచారంలో కూడా సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దుపై జగన్ ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. సీపీఎస్‌ రద్దు వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభమేమి ఉండదని.. అదనపు భారం తప్పదని తేల్చి చెప్పింది. గత ప్రభుత్వాలు కూడా సీపీఎస్‌ రద్దుకు సాహసం చేయలేదు. దీంతో సిపిఎస్ విషయంలో సీఎం జగన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్పష్టత కావాలంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య .. లేదంటే సెప్టెంబర్ 1న బ్లాక్ డే

సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్పష్టత కావాలంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య .. లేదంటే సెప్టెంబర్ 1న బ్లాక్ డే

దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోకపోయినా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయనకు ఈ విషయం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నాయకులు. ఇక సిపిఎస్ రద్దు విషయంలో ఎలాంటి హామీ లభించకపోతే మాత్రం 1న బ్లాక్‌ డే నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నాలు, మానవహారాలు, ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు.

సీఎం అమెరికా పర్యటనకు ముందే ఏపీ ఉద్యోగుల సమాఖ్య నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక ఆయన అమెరికానుంచి రాగానే మరోసారి అపాయింట్‌మెంట్‌ కోరదామని నిర్ణయించారు. లేని పక్షంలో సెప్టెంబరు 1న బ్లాక్‌ డేను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు.

జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి .. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ ఇవే

జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి .. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ ఇవే

ఈ సమావేశంలో నేతలు పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జగన్‌ ఇచ్చిన హామీలను నిబద్దతగా అమలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు . సీఎంవోలోని కొంతమంది అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రధానమైన డిమాండ్లను సీఎం జగన్ ముందు ఉంచాలని నిర్ణయించారు.
ఇక ఈ సమావేశంలో ప్రతి నెలా ఉద్యోగుల ఫ్రాన్‌ అక్కౌంట్‌ నుంచి వసూలు చేస్తున్న చందాలను ఆపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ ఏటి తీసివేసే నిర్ణయాన్ని పున సమీక్షించాలని కోరారు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఇక సిపిఎస్ రద్దు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.

English summary
Andhra Pradesh state government employees fedaration wide-ranging meeting was held in Vijayawada. The meeting was mainly discussed the CPS ban .The Jagan assured to abolish the CPS before the elections and now he is not talking about that . If Jagan do not clarify, September 1 is said to be Black Day the fedaration decides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X