వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీ నోటిఫికేషన్‌పై భగ్గుమన్న ఉద్యోగులు- ధర్నాలు, మెరుపుసమ్మెకూ రెడీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇవాళ విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఉద్యోగులు భగ్గుమన్నారు. కరోనా ప్రభావం ఉందని చెప్పినా, వ్యాక్సినేషన్‌ పూర్తికాకుండా ఎన్నికలు వద్దని చెప్పినా వినకుండా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పేస్తున్నారు. పలుచోట్ల ధర్నాలకు దిగిన ఉద్యోగ సంఘాలు... మెరుపు సమ్మెకూ సై అంటున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్తున్నారు.

Recommended Video

AP Local Body Elections: First notification of AP panchayat elections issued | Oneindia Telugu

మీకో న్యాయం- ఓటర్లకో న్యాయమా ?- అద్దాల ఛాంబర్‌లో నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌పై వైసీపీ ట్రోలింగ్‌ మీకో న్యాయం- ఓటర్లకో న్యాయమా ?- అద్దాల ఛాంబర్‌లో నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌పై వైసీపీ ట్రోలింగ్‌

నిమ్మగడ్డ తీరుపై భగ్గుమన్న ఉద్యోగులు

నిమ్మగడ్డ తీరుపై భగ్గుమన్న ఉద్యోగులు

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేదని చెప్పినా వినకుండా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ నోటిఫికేష్‌ విడుదల చేయడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్‌ తీరుపై మండిపడుతున్నారు. కరోనా ప్రభావం తగ్గకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని తాము చెప్పినా వినకుండా, సుప్రీంకోర్టులో కేసును కూడా లెక్కచేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తాను గ్లాస్‌ ఛాంబర్లో కూర్చుని ప్రెస్‌మీట్‌ నిర్వహించి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహిస్తారా అని ఉద్యోగులు నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నారు.

క్లీవేజ్ షోతో సెగలు.. కరిష్మా తన్నా అందాల విందు

వ్యాక్సిన్‌ ఇచ్చాకే ఎన్నికల్లో పాల్గొంటాం

వ్యాక్సిన్‌ ఇచ్చాకే ఎన్నికల్లో పాల్గొంటాం

ఇవాళ జారీ అయిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య స్పందించింది. టీకా ఇచ్చేవరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనేది లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తేల్చిచెప్పారు. మా ప్రాణాలను రక్షించుకునే హక్కు మాకుందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాజ్యాంగం తమకు ఆ హక్కు కల్పించిందన్నారు. ప్రాణాపాయం వస్తే ఎదుటివాడిని చంపే హక్కూ తమకు ఉంటుందన్నారు. తమ హక్కును సుప్రీంకోర్టు కాదనదని భావిస్తున్నట్లు వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విధులకు సమ్మతించే వారితో ఎన్నికలు జరుపుకోవచ్చని ఆయన సూచించారు. ఎన్నికలు పెట్టాలనే పంతంతో ఎస్‌ఈసీ ఉన్నారన్నారు.

మాకో... మీరు గ్లాస్‌ ఛాంబర్‌లో, మేం రోడ్లపైనా

మాకో... మీరు గ్లాస్‌ ఛాంబర్‌లో, మేం రోడ్లపైనా


ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ తీరుపై ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి కూడా తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించే హక్కు నిమ్మగడ్డకు లేదన్నారు. గ్లాస్‌ ఛాంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రెస్‌మీట్‌ నిర్వహించిన నిమ్మగడ్డ, తమను మాత్రం రోడ్లపైకి వెళ్లి ఎన్నికల విధులు నిర్వహించమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నిమ్మగడ్డ తీరుకు నిరసనగా తాము ఆందోళనలు చేపడతామని, సోమవారం సుప్రీంకోర్టుకూ ఇదే విషయం చెబుతామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు కరోనా సోకిన విషయాన్ని చంద్రశేఖర్‌రెడ్డి గుర్తుచేశారు.

మెరుపు సమ్మెకూ ఉద్యోగులు రెడీ

మెరుపు సమ్మెకూ ఉద్యోగులు రెడీ

రాష్ట్రంలో కరోనా పరిస్ధితుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఖండించారు.
10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకే తాటిపై ఉన్నామని, ఉద్యోగులను భయపెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నారని ఆయన ఆరోపిచారు. మమ్మల్ని భయపెట్టి చంపే అధికారం మీకు లేదని,. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడమని ఎన్జీవో నేత చంద్రశేఖర్‌ రెడ్డి హెచ్చరించారు. ఎంతమందిపై మీరు చర్యలు తీసుకుంటారని నిమ్మగడ్డను ఆయన ప్రశ్నించారు.

English summary
ap employees unions warns sec nimmagadda to go for mass strike against panchayat polls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X