వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: రెండో బిడ్డర్‌కు సదావర్తి భూములు, రూ.30 కోట్లు చెల్లింపు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: సదావర్తి భూముల కేసులో కీలకమైన మలుపు చోటుచేసుకొంది. వేలం పాటలో పాల్గొన్న రెండవ బిడ్డర్ లక్ష్మణ్‌కు దేవాదాయశాఖ అవకాశం కల్పించింది. వేలంపాటలో పాల్గొన్న శ్రీనివాసరావు భూములు తీసుకొనేందుకు ముందుకు రాకపోవడంతో రెండవ బిడ్డర్ లక్ష్మణ్ భూములను ఇవ్వాలని దేవాదాయశాఖ నిర్ణయం తీసుకొంది.

సదావర్తి భూముల కేసు మరో మలుపు తిరిగింది. వేలం పాటలో పాల్గొన్న రెండవ బిడ్డర్ లక్ష్మణ్‌కు దేవాదాయశాఖ అవకాశం కల్పించింది. దీంతో భూములు తీసుకునేందుకు గాను ఆన్‌లైన్‌లో రూ. 30 కోట్లు చెల్లించారు. నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోపే సగం చెల్లించినందున లక్ష్మణ్‌కే భూములు దక్కే అవకాశం ఉంది.

Ap Endowment department key decision on Sadavarthi lands

తమిళనాడులో సదావర్తి సత్రానికి చెందిన భూములను రూ.60.30 కోట్లకు వేలం పాడిన సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి.. డబ్బు చెల్లించేందుకు ముందుకు రాకుంటే రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అప్పగించాలని హైకోర్టు సూచించింది. తమిళనాడులో సదావర్తి సత్రానికి చెందిన భూములను రూ.60.30 కోట్లకు పాడిన సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి.. డబ్బు చెల్లించేందుకు ముందుకు రాకుంటే రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అప్పగించాలని హైకోర్టు సూచించింది.

రెండవ బిడ్డర్ అయిన లక్ష్మణ్ ముందుకు రావడంతో ఆయనకే భూములు దక్కే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. మొద‌టి బిడ్డ‌ర్ కంటే చ‌ద‌ల‌వాడ ల‌క్ష్మ‌ణ్‌ రూ.5 ల‌క్ష‌లు త‌క్కువ కోట్ చేశారు. ఆయ‌న డ‌బ్బులు చెల్లించ‌డంతో ఆయ‌న‌కే ఆ భూములు ద‌క్క‌నున్నాయి.

English summary
Andhra pradesh endowment department took a key decision on Sadavarthi lands scheme.Second Bidder Chadalawada Laxman paid to Endowment department Rs 30 crores online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X