వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP ESI SCAM:అవినీతి చేయకున్నా అరెస్ట్ చేస్తారా..? లేఖ రాయడమే పాపమా, డీజీ కామెంట్లపై లోకేశ్

|
Google Oneindia TeluguNews

ఈఎస్ఐ స్కాంపై ఏసీబీ డీజీ చేసిన కామెంట్లు రాజకీయంగా దుమారం రేపాయి. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి సంబంధించి ఆధారం లభించలేదు అని చెప్పడం తేనేతుట్టేను కదిపినట్టైంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇందేటి.. మంత్రిగా సలహా ఇచ్చినందుకే అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు. ఇంతకీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు.

Recommended Video

ESI స్కామ్‌ : Jagan రైట్ అంటున్న BJP పనిలో పనిగా Chandrababu కు చెక్

ఏపీ ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నకు మనీ చేరలేదు కానీ, ఈ-టెండర్ పిలవకపోవడంతోనే: ఏసీబీ డీజీఏపీ ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నకు మనీ చేరలేదు కానీ, ఈ-టెండర్ పిలవకపోవడంతోనే: ఏసీబీ డీజీ

అవినీతి చేయకుంటే ఎందుకు అరెస్ట్ చేశారు..?

అవినీతి చేయకుంటే ఎందుకు అరెస్ట్ చేశారు..?


ఏపీ ఈఎస్ఐ స్కాంపై డీజీ రవికుమార్ చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. ఈఎస్ఐ మందులు/ పరికరాల కొనుగోళ్లలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు రూపాయి అవినీతి చేయలేదని చెప్పారని నారా లోకేశ్ గుర్తుచేశారు. తెలంగాణ ఈఎస్ఐ మాదిరిగా అమలు చేయాలని లేఖ రాసిన పాపానికి అరెస్ట్ చేశామని చెప్పారని పేర్కొన్నారు. ఇంతకంటే ఘోరం మరోటి ఉంటుందా అని లోకేశ్ నిట్టూర్చారు. అధికారులకు సలహా, సూచలను ఇచ్చినా తప్పేనా అంటూ ధ్వజమెత్తారు. ఇదీ ప్రభుత్వ కక్షసాధింపు చర్య కాదా అని ప్రశ్నించారు.

తదుపరి విచారణ కోసం అరెస్ట్ చేశారా..?

తదుపరి విచారణ కోసం అరెస్ట్ చేశారా..?

డీలర్ల నుంచి అచ్చెన్నాయుడు నగదు తీసుకున్నట్టు దర్యాప్తులో ఎక్కడా బయట పడలేదని ఏసీబీ వెల్లడించిందని లోకేశ్ గుర్తుచేశారు. ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని ఏసీబీ జేడీ రవికుమార్‌ పేర్కొన్నారు. కానీ తదుపరి విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మాత్రం ఆయన తెలిపారు. ఈ విషయాలను లోకేశ్ ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

లేఖ రాయడంతో అవినీతి జరిగి ఉండొచ్చు అని: ఏసీబీ డీజీ

లేఖ రాయడంతో అవినీతి జరిగి ఉండొచ్చు అని: ఏసీబీ డీజీ


పలు కంపెనీలు మంత్రి వద్దకు వస్తుంటాయని.. ఆ సమయంలో అధికారులకు సిఫారసు చేయవచ్చు... కానీ వాటిని అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులకు ఛాన్స్ ఇవ్వాలని డీజీ రవికుమార్ అన్నారు. కానీ ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలని అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో కుంభకోణం జరిగి ఉంటుందని తెలిపారు. టెండర్‌కు వెళ్లాల్సిన వాటికి సంబంధించి ఈ విధంగా వ్యవహరించొద్దు అని తెలిపారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి పాత్రపై ఆధారాలున్నాయని ఏసీబీ డీజీ తెలిపారు.

కోట్లలో కొనుగోళ్లకు ఈ-టెండర్ తప్పనిసరి..

కోట్లలో కొనుగోళ్లకు ఈ-టెండర్ తప్పనిసరి..

వాస్తవానికి లక్ష రూపాయలకు ఎక్కువ గల వస్తువులు/పరికరాలు కొనుగోలు చేయాలంటే ఈ-టెండర్‌ పిలవాలి. రూ.వందల కోట్ల కొనుగోళ్లలో ఈ-టెండర్ పిలువకపోవడం.. కేటాయించిన నిధుల కన్నా ఎక్కువ కొనుగోళ్లు చేయడంతో అవినీతి జరిగి ఉంటుందన్నారు. ఇందులో అధికారుల పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసులు 19 మంది పాత్ర ఉందని గుర్తించామని.. 12 మందిని అరెస్టు చేశామని తెలిపారు. మరో ఏడుగురిని అరెస్టు చేస్తామని వివరించారు.

English summary
AP ESI SCAM: tdp leader nara lokesh slams acb dg ravikumar, if minister not do corruption why you are arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X