వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెల్టు తీయాల్సిందే: ప‌ది రోజులే స‌మ‌యం : అధికారులే బాధ్యులు...!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాల‌తో ఎక్సైజ్ యంత్రాంగం క‌దిలింది. బెల్టు షాపుల మీద క‌న్నెర్ర చేసారు. 13 జిల్లాల్లోని ఎక్సైజ్ అధికారుల‌తో రెవిన్యూ ముఖ్య కార్య‌ద‌ర్శి..ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. ప‌ది రోజుల డెడ్ లైన్ విధించారు. ఈ లోగా ప్ర‌తీ గ్రామంలో బెల్టు షాపుల‌ను తొలిగించాల్సిందేన‌ని ఆదేశించారు. ప్ర‌తీ గ్రామంలో కానిస్టేబుల్ .. ప్ర‌తీ మండ‌ల ప‌రిధిలో ఒక ఎస్సై బాధ్య‌త తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసారు. దీంతో పాటుగా గంజాయి నిరోధానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ధేశించారు.

బెల్టుషాపుల పైన ఉక్కుపాదం..
ముఖ్య‌మంత్రి న‌వ ర‌త్నాల్లో ఒక‌టైన సంపూర్ణ మ‌ధ్య నిషేధం పైన అధికార యంత్రాంగం క‌దిలింది. రెండు రోజుల క్రితం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెవిన్యూ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. బెల్టు షాపుల ర‌ద్దు చేయాల్సిందేన‌ని.. ద‌శ‌ల వారీగా మ‌ద్య నిషేధానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసారు. సీఎం అదేశాల మేర‌కు రెవిన్యూ ముఖ్య కార్య‌ద‌ర్శి సాంబ‌శివ‌రావు ..ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లాల వారీగా స‌మీక్షించారు. ప్ర‌తీ గ్రామం బాధ్య‌త ఒక కానిస్టేబుల్‌కు ఇవ్వాల‌ని, అదే విధంగా ఎస్సైకు మండ‌లం బాధ్య‌త అప్ప‌గించారు. ప్ర‌తీ రోజు ఎన్ని బెల్టు షాపులు తొలిగించిందీ..ఎన్ని కేసులు న‌మోదు చేసిందీ లెక్క‌లు ఇవ్వాల‌ని ఆదేశించారు. స్టేష‌న్ల వారీగా లెక్క‌ల‌తో పాటుగా సిబ్బంది స‌మ‌ర్ధ‌త‌ను గుర్తించి వారికి అవార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

AP Excise heads ordered District officials to must control belt shops in ground level

గ‌త ప్ర‌భుత్వంలో తొలి సంత‌కాల్లో..
2014లో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేవం పార్టీ ముందు ఇచ్చిన హామీ మేర‌కు.. 2014 జూన్ 8న ప్ర‌మాణ స్వీకారం చేసిన చంద్ర‌బాబు అయిదు సంత‌కాలు చేసారు. అందులో ఒక సంత‌కం బెల్టు షాపుల ర‌ద్దు. అయితే, ఏపీలో మాత్రం య‌ధావిధిగా బెల్టు షాపులు కొన‌సాగుతున్నాయి. దీంతో..న‌వ‌ర‌త్నాల ప్ర‌కట‌న‌లో భాగంగా జ‌గ‌న్ 2024 నాటికి స్టార్ హోట‌ళ్ల‌లో మిన‌హా ఏపీలో మ‌ద్యం లేకుండా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అలా చేసిన త‌రువాత మాత్ర‌మే 2024లో ఓట్లు అడుగుతామ‌ని స్ప‌ష్టం చేసారు. ఇదే అంశం పైన ముఖ్య‌మంత్రి అధికారుల‌తో స‌మీక్షించారు. త‌న లక్ష్యాన్ని స్ప‌ష్టం చేసారు. ఆదాయం గురించి ఆలోచ‌న వ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. ప‌ది రోజుల్లోగా బెల్టు షాపులు ర‌ద్దు చేయాల‌ని.. వాటికి మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తున్న మ‌ద్యం దుకాణాల లైసెన్స్‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు. దీంతో..అధికార యంత్రాంగం జిల్లా అధికారుల‌కు సీరియ‌స్‌గా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

English summary
AP Excise heads ordered District officials to must control belt shops in ground level. As per CM orders officers cancel the licence of the shops which support belt shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X