వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌ను ప్రాధేయపడ్డ ఆర్థిక మంత్రి..! స‌సేమిరా అన్న సీఎం..!! ఎట్ట‌కేల‌కు అంగీకారం

|
Google Oneindia TeluguNews

తొలి సారి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాద్ ముఖ్య‌మంత్రిని బ‌తిమ‌లాడుకున్నారు. స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే ముహూర్తం ఖ‌రారు చేసే స‌మ‌యంలో..ఈ అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. బ‌డ్జెట్ తుది ఆమోద మ‌ద్ర వేసారు జ‌గ‌న్‌. అదే స‌మ‌యంలో మంత్రి బుగ్గ‌న తాను చెబుతున్న‌ది వినాల‌ని సీఎంను వేడుకున్నారు. కానీ, సీఎం మాత్రం స‌సేమిరా అన్నారు. ఇక‌..బుగ్గ‌న ఎంత సేప‌టికీ ఆ విష‌యం వ‌ద‌ల‌క పోవ‌టం..ప‌దే ప‌దే అడ‌గ‌టం తో చివ‌ర‌కు జ‌గ‌న్ స‌రే అన్నారు. దీంతో.. బుగ్గ‌న తాను కోరుకున్న విధంగా నిర్ణ‌యం తీసుకున్నారు.

Recommended Video

జనహితమే లక్ష్యంగా జగన్ సర్కార్ బడ్జెట్
 జ‌గ‌న్‌ను బ‌తిమ‌లాడుకున్న బుగ్గ‌న‌..

జ‌గ‌న్‌ను బ‌తిమ‌లాడుకున్న బుగ్గ‌న‌..

ఏపీ లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలి బ‌డ్జెట్ ను ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాధ్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ కేటాయింపులు చేసారు.అయితే, దీనికి ముందు ఆర్దిక మంత్రిగా బుగ్గ‌న ఒక విష‌యంలో ముఖ్య‌మంత్రిని ఒప్పించ‌టానికి చాలాసేపు బ‌తిమ‌లాడుకోవాల్సి వ‌చ్చింది. తొలుత అంగీక‌రించని జ‌గ‌న్‌..ఆ త‌రువాత మొత్త‌బ‌డ్డారు. దీంతో..బ‌డ్జెట్ లో అదే విషయాన్ని బుగ్గ‌న స్ప‌ష్టం చేసారు. ఏపి బ‌డ్జెట్ లో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ ర‌త్నాల గురించి బుగ్గ‌న ప్ర‌స్తావించారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో మాత్ర‌మే ప్ర‌వేశ పెడుతున్న ఈ ప‌ధ‌కానిని జ‌గ‌నన్న అమ్మ ఒడి గా పేరు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీని కోసం తాను సీఎంను ఎంత‌గానో బ‌తిమ‌లాడి ఒప్పించాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించారు. అదే విధంగా కాలేజి విద్యార్దుల‌కు ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌తో పాటుగా..విద్యార్దికి 20 వేలు చొప్పొన ఇచ్చే ప‌ధ‌కానికి జ‌గ‌న‌న్న దీవెన ప‌ధ‌కం గా ప్ర‌క‌టించారు. ఈ ఈ రెండు ప‌ధ‌కాల‌కు బుగ్గ‌న ఒత్తిడితోనే జ‌గ‌న్ పేర్లు ఖ‌రారు చేసారు.

అమ్మ ఒడి ద్వారా

అమ్మ ఒడి ద్వారా


అమ్మ ఒడి ప‌ధ‌కానికి 6455 కోట్లు కేటాయించారు. దీని ద్వారా ఒక‌టో త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుకొనే పిల్ల‌ల త‌ల్లుల‌కు ఈ మొత్తం అందుతుంది. మొత్తంగా 43 లక్ష‌ల మందికి ప్ర‌యోజ‌నం జ‌రుగుతుం ని అంచ‌నా వేసారు. విద్యా శాఖ కోసం రూ. 32,618 కోట్ల‌ను ప్ర‌తిపాదించారు. అందులో పాఠశాల‌ల మౌళిక వ‌స‌తుల అభివృద్ది కోసం రూ. 1500 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు రూ. 3,021.63 కోట్లు..మధ్యమిక విద్యకు రూ. 21,612.30 కోట్లు ప్ర‌తిపాదించారు. మాద్య మిక విద్యకు రూ. 21,612.30 కోట్లు..పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1,500 కోట్లు..మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1,077 కోట్లు..పాఠశాలల నిర్వహణ గ్రాంటుకు రూ. 160 కోట్లు కేటాయిస్తూ బ‌డ్జెట్ మొత్తంలో విద్యా శాఖ‌కు అధిక కేటాయింపులు ఇచ్చారు. ఇప్పుడు ప్ర‌భుత్వం చేస్తున్న ఈ ఖ‌ర్చు ద్వారా భ‌విష్య‌త్‌లో లక్ష‌లాది కుటుంబాల‌కు మేలు జ‌రుగుతుంద‌ని..మాన‌వ వ‌న‌రుల అభివృద్ది మెరుగ‌వుతుంద‌ని వివ‌రించారు.

అమ్మ దీవెన‌కు జ‌గ‌న్ పేరు..

అమ్మ దీవెన‌కు జ‌గ‌న్ పేరు..

విద్య‌కు సంబంధించే మ‌రో ప‌ధ‌కాన్ని ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ ప్ర‌క‌టించారు. అమ్మ ఒడి త‌ర‌హాలోనే విద్యార్ధుల‌కు ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ ప‌ధ‌కాన్ని అమ‌లు చేస్తామ‌న్నారు. వంద శాతం ఫీజు రీయంబ‌ర్స్ చేసినా.. వారు హాస్ట‌ళ్లు..భోజ‌నం..ఇత‌ర అవ‌స‌రాల కోసం ప్ర‌తీ విద్యార్ధికి 20 వేల రూపాయాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనికి కోసం బ‌డ్జెట్‌లో రూ. 4962.03 కోట్లు ప్ర‌తిపాదించారు. దీని ద్వారా దాదాపు 15.05 ల‌క్ష‌ల మందికి లబ్ది చేకూరుతుంద‌ని ఆర్దిక మంత్రి చెప్పుకొచ్చారు. ఈ ప‌ధ‌కాన్ని జ‌గ‌న‌న్న దీవెన పేరుతో అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీని ద్వారా పూర్తి స్థాయిలో ఈ రెండు ప‌ధ‌కాలు అమ‌లు చేయ‌టం తో ఒక‌టో త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దివే పిల్ల‌లు..అదే విధంగా ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ వినియోగించుకుంటున్న వారికి జ‌గ‌న్ పేరుతోనే ప్ర‌భుత్వం సాయం అంద‌నుంది.

English summary
AP Finance Minister Buggana Rajendra Nath and cabinet members requested CM jagan to fix his name for Amma Vadi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X