దోపిడీ చూసి ప్రపంచ బ్యాంక్ భయపడిపోయింది: దేనికైనా సిద్దమే.. బాబు సవాల్: సీఎం జగన్ ఫైర్...!
ఏపీ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులను నిలిపివేస్తే తీసుకున్న నిర్ణయం పైన సభలో రగడ చోటు చేసు కుంది. ఈ వ్యవహారం పైన అసెంబ్లీలో రాష్ట్ర ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రకటన చేసారు. గతం ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి..దోపిడీ..సరైన అభిప్రాయం లేక పోవటం వలనే నిధులు నిలిచిపోయాయని వివరించారు. దీనికి ప్రతిపక్షనేత చంద్రబాబు సైతం సీరియస్‌గా స్పందించారు. ప్రభుత్వం తొలి నుండి అమరావతి పైన అక్కసు తో ఉందని ఆరోపించారు. టీడీపీ హాయంలో తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇప్పుడు అయిదు వేల కోట్ల ప్రపంచ బ్యాంకు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. రాజధానిలో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమని ప్రకటించారు. చంద్రబాబుతో సహా ప్రతిపక్ష తీరు పైన ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.

దోపిడి చూపి వెనక్కు వెళ్లిపోయారు.
రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రెండు వేల కోట్ల రుణం విషయంలో వెనకడుగు వేయటం మీద ఆర్దిక మంత్రి బుగ్గన శాసనసభలో ప్రకటన చేసారు. 2017, 2018లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారని, వారికి ఇక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆ తరువాత ప్రపంచ బ్యాం కు ప్రతినిధులు ఇచ్చిన నివేదికపై టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే రుణం నిలిపివేసారని వివరించారు.
తమ ప్రభుత్వానికి అయిదు వేల కోట్ల సాయం అందించేందుకు సిద్దంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు తమకు అందిన ఫిర్యాదుల మీద క్షేత్ర స్థాయి విచారణకు వస్తామని కేంద్రానికి సమాచారం ఇస్తే..అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని వివరించారు. విదేశీ బ్యాంకు మన భూభాగంలో విచారణ చేస్తే అది సార్వభామత్వానికి సరి కాదనే ఉద్దేశంతో తిరస్కరించారని మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు.


అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్దమే..!
ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ తీరును తప్పు బట్టారు. రాజధాని రుణం విషయంలో కేంద్రం వివరణ కోరిన సమ యంలో కొంత శ్రద్దగా వ్యవహరించాల్సి ఉందని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలే పొలం తగలబెట్టించారని..ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. అమరావతి ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదు. గతంలో అమరావతిలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటించింది. అమరావతిపై వైసీపీ ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వివరిం చారు. రాజధాని భూసమీరణలో 7వేల ఎకరాల భూమి మిగులుతుందని... ఆ భూమితో అమరావతి ప్రాజెక్ట్ పూర్తి చేయ గలుగుతామన్నారు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు నిర్మిస్తేనే ఏపీకి ఆదాయం వస్తుందన్నారు. వైసీపీ ప్రభు త్వం వచ్చాక రాజధానిలో భూముల ధరలు పడిపోయాయి. భూములు ఇచ్చిన రైతులకు దిగులు పట్టుకుందని చంద్రబాబు వివరించారు.

ముఖ్యమంత్రి జగన్ ఫైర్...
గతంలో ప్రపంచ బ్యాంకు లేవనెత్తిన అభ్యంతరాల పైన నాటి టీడీపీ ప్రభుత్వ సరైన రీతిలో స్పందించలేదంటూ ఆర్దిక మంత్రి ధ్వజమెత్తారు. అమరావతిలో రహదారుల ప్యాకేజీల్లో ఏ రకంగా ఎక్సెస్ ధరలు కోట్ చెసిందీ పేర్లతో సహా చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో లేవని..టీడీపీ ప్రభుత్వం వారికి చెల్లింపులు పూర్తి చేసి మధ్నాహ్న భోజనం.. ఆషా వర్కర్లు..ఫీజు రీయంబర్స్ మెంట్ వాటిని పెండింగ్ పెట్టిండని ఫైర్ అయ్యారు. కిలో మీటరు రోడ్డుకు 32 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారని దుయ్యబట్టారు. ఆర్దిక మంత్రి వివరణ తరువాత మరోసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టముట్టారు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకొని కీలకమైన బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు..అదే విధంగా పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి వంటి బిల్లుల ప్రతిపాదించే సమయంలో ప్రతిపక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని..ఇదే నా 40 ఏళ్ల అనుభవం అంటూ చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు. సభలో గందరగోళం జరగటంతో వాయిదా వేసారు.