విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కబలింపు: ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ మృతి, 10 రోజులుగా చికిత్స, పలువురి సంతాపం..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అయితే మరణాలు కూడా రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయి. ఇవాళ ఉదయం ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులును కరోనా కబలించంది. వైరస్ సోకి ఆయన తెల్లవారుజామును మృతిచెందారు. కరోనా వైరస్ రావడంతో పది రోజుల నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

శుక్రవారం ఉదయం ఐదు గంటలకు రామాంజనేయులు చనిపోయారని వైద్యులు ప్రకటించారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు.. కాగా ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తొలి చైర్మన్‌గా చలమలశెట్టి రామాంజనేయులను నియమించారు. రామాంజనేయులు మృతిపై మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Recommended Video

India - Japan : చైనాకు బుద్ధి చెప్పేలా.. Japan తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్ ! || Oneindia
ap first kapu corporation chairman died due to coronavirus..

చలమలశెట్టి రామాంజనేయులు మృతిపై చంద్రబాబు సంతాపం తెలిపారు. గత ప్రభుత్వ భయాంలో కాపు కార్పొరేషన్ తొలి చైర్మన్‌గా ఉత్తమ సేవలు అందించారని గుర్తుచేశారు. పార్టీకి, కాపుల పురోగతి కోసం ఆయన పునరంకితం అయ్యారని తెలిపారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చలమలశెట్టి మృతిపై నారా లోకేశ్ కూడా విచారం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం చివరి శ్వాసం వరకు పనిచేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

English summary
andhra pradesh first kapu corporation chairman chalamalasetty ramanjaneyulu died due to coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X